ఆధునిక జీవనశైలిలో భాగంగా వంటపాత్రల ఎంపిక కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం తీసుకోవడం వల్ల సంతాన సమస్యలు తలెత్తుతాయని, శృంగారంపై ఆసక్తి తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రకటన వినడానికి వింతగా అనిపించినా, దీని వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. అల్యూమినియం పాత్రల్లో వండిన పదార్థాలను తరచూ తినడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది నేరుగా శృంగారం పట్ల ఆసక్తి తగ్గడానికి దారితీస్తుంది. పురుషులలో టెస్టోస్టిరాన్ స్థాయిలు పడిపోవడంతో పాటు, శుక్ర కణాల నాణ్యత తగ్గుతుంది. ఫలితంగా గర్భం దాల్చడం కష్టమవుతుంది.
హార్మోన్ల ఉత్పత్తికి కీలకమైన ఎండోక్రిన్ వ్యవస్థపై అల్యూమినియం ప్రతికూల ప్రభావం చూపుతుంది, తద్వారా హార్మోన్లు సరిగ్గా విడుదల కావు. స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్లపైనా ఇదే ప్రభావం కనిపిస్తుంది, ఇది కూడా సంతాన సమస్యలకు ఒక కారణమవుతుంది. సంతాన సమస్యలతో పాటు, అల్యూమినియం మెదడును కూడా దెబ్బతీస్తుంది. దీనివల్ల విపరీతమైన నీరసం, నిద్ర మబ్బుగా ఉండటం, ఏ పనిపైనా దృష్టి పెట్టలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మానసికంగానూ అలసట, చిరాకు, మూడ్ స్వింగ్స్ పెరిగిపోతాయి. ఈ సమస్యలన్నింటికీ ముఖ్య కారణం అల్యూమినియంలో ఉండే టాక్సిసిటీ (విషగుణం). ఆహారంలో కలిసి, ఇవి శరీరంలో విషపదార్థాలుగా మారి హాని కలిగిస్తాయి. ముఖ్యంగా చింతపండు, నిమ్మరసం, పాలు వంటి పులుపు లేదా ఆమ్ల గుణం ఉన్న పదార్థాలను అల్యూమినియం పాత్రల్లో వండటం వల్ల విషపదార్థాలు ఎక్కువగా ఆహారంలో కలుస్తాయి.
సమస్యకు చెక్ పెట్టండిలా..
ఈ సమస్యలను నివారించడానికి అల్యూమినియం పాత్రలను పూర్తిగా పక్కన పెట్టడం ఉత్తమం. వాటికి బదులుగా స్టెయిన్ లెస్ స్టీల్ లేదా ఇనుప పాత్రలను వాడాలి. అలాగే, వేడి వేడి ఆహార పదార్థాలను అల్యూమినియం ఫాయిల్ కవర్లలో ప్యాక్ చేయడం తగ్గించాలి. పసుపు, కూరగాయలు, పండ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు వెళ్తాయి. ఈ చిన్నపాటి అలవాట్ల మార్పులు సంతాన సమస్యలను తగ్గించడమే కాకుండా, సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.