Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు అలెర్ట్.. పెద్ద ప్రమాదం పొంచి ఉందన్న భారత ప్రభుత్వం

Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు అలెర్ట్.. పెద్ద ప్రమాదం పొంచి ఉందన్న భారత ప్రభుత్వం


గూగుల్ క్రోమ్ వినియోగదారులకు మొదటి పెద్ద భద్రతా ముప్పు పొంచి ఉందని భారత ప్రభుత్వం హెచ్చరించింది. విండోస్ లేదా మాకోస్ సిస్టమ్‌లలో వెబ్ బ్రౌజర్‌ను ఉపయోగించే వారు జాగ్రత్తగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ-ఐఎన్) స్పష్టం చేసింది. ముఖ్యంగా హ్యాకర్లు మీ సిస్టమ్‌ను క్రోమ్ ద్వారా టార్గెట్ చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. బ్రౌజ్ చేసే సమయంలో పర్మిషన్స్ ఇచ్చే ముందు ఒకటి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలని కోరింది. 

స్కియా, వీ8 వంటి సైట్స్‌ను వినియోగించే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వివరించారు. అలాగే ఎక్స్‌టెన్షన్స్ ఏపీఐలను ఇన్‌స్టాల్ చేేయడాన్ని మానుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రిమోట్ దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.  వ్యక్తిగత డేటా తస్కరణే లక్ష్యంగా హ్యాకర్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాల పాస్‌వర్డ్స్ వంటివి ఆటో సేవ్ చేసుకుంటే బ్యాంకు ఖాతాలను కూడా ఖాళీ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

ముఖ్యంగా లినక్స్  133.0.6943.53 కి ముందు క్రోమ్ వెర్షన్లు వాడే వారికి ఈ ముప్పు అధికంగా ఉందని చెబుతున్నారు. అలాగే విండోస్, మ్యాక్ కోసం 133.0.6943.53/54 కి ముందున్న గూగుల్ క్రోమ్ వెర్షన్లు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొంటున్నారు. కాబట్టి క్రోమ్ యూజర్లు కచ్చితంగా లేటెస్ట్ అప్‌డేట్స్‌ను తనిఖీ చేస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. క్రోమ్‌లో రైట్ సైడ్‌లో ఉన్న త్రీ డాట్స్‌ను సెలెక్ట్ చేసి మెనూకు వెళ్లి అప్‌డేట్స్ తనికీ చేయాలని చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *