Gold Rates: అలర్ట్.. తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

Gold Rates: అలర్ట్.. తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..


Gold And Silver Price In Hyderabad – Vijayawada: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి.. ఇటీవల బంగారం ధర పది గ్రాములు ఏకంగా లక్షా 3 వేలు దాటింది.. వెండి కూడా అదే బాటలో కొనసాగుతోంది. వాస్తవానికి బంగారం, వెండి ధరలలో నిరంతరం మార్పు ఉంటుంది. కొన్నిసార్లు పెరుగుతూ, మరికొన్ని కొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి.. గత నాలుగు రోజుల క్రితం రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర.. తగ్గుతూ వస్తోంది.. ఆగస్టు 16 శనివారం ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశియంగా బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర స్వల్పంగా పెరిగింది.

దేశియంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

  • 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.10 మేర ధర తగ్గి.. రూ.1,01,230 గా ఉంది..
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 మేర ధర తగ్గి.. రూ.92,790 కి చేరుకుంది.
  • వెండి కిలో ధర రూ.100 పెరిగి.. రూ.1,16,200లుగా ఉంది.

అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,01,230 ఉంటే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,790 ఉంది. కిలో వెండి ధర రూ.1,26,200 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,01,230, 22 క్యారెట్ల ధర రూ.92,790 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,26,200 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,01,380, 22 క్యారెట్ల ధర రూ.92,940 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,16,200 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,01,230, 22 క్యారెట్ల ధర రూ.93,790 ఉంది. వెండి ధర కిలో రూ.1,16,200 ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,230 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.92,790 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,26,200 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,01,230, 22 క్యారెట్ల ధర రూ.92,790 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,16,200 ఉంది.

గమనిక, బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *