Gold Price Today: రాఖీ పండగకి భగ్గుమన్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తలం ధర ఎంతో తెలుసా?

Gold Price Today: రాఖీ పండగకి భగ్గుమన్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తలం ధర  ఎంతో తెలుసా?


బంగారం ధరలు వేగంగా పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలు, బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి ధరలను ఈ స్థాయికి నెట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. భారతదేశం, స్విట్జర్లాండ్ నుండి దిగుమతులపై భారీ సుంకాలు విధించారు. ఇది ప్రపంచ వాణిజ్యంలో అస్థిరతను పెంచింది. ఈ సుంకాలు భారతదేశ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేశాయి. రూపాయి విలువ పడిపోయింది. బలహీనమైన రూపాయి బంగారాన్ని మరింత ఖరీదైనదిగా చేస్తోంది. దేశీయ మార్కెట్లో దాని ధరలను పెంచుతుంది. ప్రస్తుతం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఆగస్ట్‌ 9వ తేదీన దేశీయంగా బంగారం ధరలు భారీగానే పెరిగాయి. నిన్నటితో పోల్చుకుంటే తులం బంగారంపై ఏకంగా 500 రూపాయలకుపైగా పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,03,320 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.94,710 వద్ద ఉంది. ఇక వెండి విషయానికొస్తే కిలో సిల్వర్‌ ధరర 1,16,900 ఉంది.

ఇది కూడా చదవండి: Post Office: పోస్టాఫీసులో సూపర్‌ స్కీమ్‌.. రూ.12,500 డిపాజిట్‌తో రూ.70 లక్షలు.. ఎలా?

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,320 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.94,710 ఉంది.
  2. చెన్నైలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,320 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.94,710 ఉంది.
  3. ముంబైలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,320 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.94,710 ఉంది.
  4. ఢిల్లీలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,470 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.94,860 ఉంది.
  5. బెంగళూరులో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,320 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.94,710 ఉంది.

ఈ రోజుల్లో అనేక దేశాల కేంద్ర బ్యాంకులు, పెద్ద పెట్టుబడిదారులు బంగారాన్ని వేగంగా కొనుగోలు చేస్తున్నారు. ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్లలో బంగారంపై పెట్టుబడి కూడా పెరిగింది. చైనా కేంద్ర బ్యాంకు కూడా నిరంతరం బంగారాన్ని సేకరిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా దాని డిమాండ్, ధరను పెంచింది. దీనితో పాటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అవకాశం కూడా బంగారాన్ని మరింత ఆకర్షణీయంగా చేసింది. ఈ కారణంగానే నేడు బంగారం పెట్టుబడిదారుల మొదటి ఎంపికగా మారింది.

ఇది కూడా చదవండి: త్వరపడండి.. 28 రోజుల వ్యాలిడిటీతో రూ.189 ప్లాన్‌..బెనిఫిట్స్‌ ఇవే

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *