Gold Price Today: తగ్గుతున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా? తగ్గుతాయా? తులం ధర ఎంత?

Gold Price Today: తగ్గుతున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా? తగ్గుతాయా? తులం ధర ఎంత?


Gold Price Today: తగ్గుతున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా? తగ్గుతాయా? తులం ధర ఎంత?
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

బంగారం ధరలు పతనమవుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో పెరుగుతున్న పసిడి.. గురువారం స్వల్పంగా తగ్గింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం.. గురువారం ఉదయం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.98,170 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,990 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో ధర రూ.1,09,900 వద్ద ఉంది.

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,170 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,990 వద్ద ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,320 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,140 వద్ద ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,170 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,990 వద్ద ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,170 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,990 వద్ద ఉంది.

బంగారం ధర డాలర్లలో వర్తకం చేస్తారు. అందుకే డాలర్ పెరుగుదల సాధారణంగా ఇతర కరెన్సీలతో కొనుగోలుదారులకు బంగారం ఖరీదైనదిగా మారుతుంది. ఇది డిమాండ్ విలువైన లోహం ధర తగ్గడానికి దారితీస్తుంది

బంగారం ధరలు ఎలా ఉంటాయి?

ప్రస్తుతం బంగారం ధరలు పడిపోతున్నా.. మళ్లీ పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తగ్గుతున్న బంగారం ధరలు స్వల్పకాలికమేనని అంటున్నారు. భారత మార్కెట్ లో బంగారం ధరలు రాబోయే రోజుల్లో 99 వేల నుంచి లక్ష రూపాయల మధ్య స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరికొంత మంది నిపుణులు 95 నుంచి ఒక లక్ష రూపాయల మధ్యగా బంగారం ధరలు స్థిరపడవచ్చని పేర్కొంటున్నారు.

ట్రంప్ నినాదాల నేపథ్యంలో ప్రపంచ వ్యాపార చర్చలు, భారతదేశ భవిష్యత్ వ్యాపార దిశ, బంగారం ధరల మార్పులపై ప్రభావం చూపుతున్నాయి. పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. ముఖ్యంగా బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. నోట్‌: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. అందుకే కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *