Geetha Govindam: ‘గీత గోవిందం’కు ఏడేళ్లు.. ఈ వంద కోట్ల మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, హీరోయిన్లు ఎవరంటే?

Geetha Govindam: ‘గీత గోవిందం’కు ఏడేళ్లు.. ఈ వంద కోట్ల మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, హీరోయిన్లు ఎవరంటే?


టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ నటించిన సినిమాల్లో గీత గోవిందం ఒకటి. 2018 ఆగస్టు 15న ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విజయ్, రష్మికలకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా విజయ్ కెరీర్ లో ఇదే మొదటి వంద కోట్ల సినిమా. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన గీత గోవిందం సినిమా ఓవరాల్ గా రూ. 132 కోట్ల కలెక్షన్లు సాధించింది. విజయ్‌, రష్మిక మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అవ్వడం.. పాటలు కూడా వైరల్‌ అవ్వడంతో సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా గీత గోవిందం చిత్రం విడుదలై నిన్నటికి(ఆగస్ట్‌ 15) ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేంటంటే.. రష్మిక, విజయ్ దేవరకొండ జోడీగా నటించిన ఈ సినిమాలో మొదట ఒక స్టార్ హీరో, హీరోయిన్ ను అనుకున్నారట. అయితే వివిధ కారణాలతో వారు రిజెక్ట్ చేయడంతో విజయ్, రష్మిక లైన్ లోకి వచ్చారట. అలా గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ను మిస్ అయిన వాళ్లెవరో తెలుసుకుందాం రండి.

గీత గోవిందం సినిమాలో విజయ్ కంటే ముందు అల్లు అర్జున్‌ను హీరోగా తీసుకుందామని డైరెక్టర్ పరశురామ్ భావించారట. అయితే బన్నీకి అప్పటికే ఉన్న సినిమాల దృష్ట్యా డేట్స్ సరిపోలేదట. దీంతో పరశురామ్ విజయ్ ను అప్రోచ్ అయ్యారట. ఇక హీరోయిన్ గా రష్మిక ప్లేస్ లో లావణ్య త్రిపాఠిని తీసుకుందామనుకున్నారట. కథ కూడా విందట. అయితే సినిమాలో లిప్ లాక్ సీన్ కారణంగా మూవీని వద్దనుకుందట. ఆ తర్వాత ఆమె ప్లేస్ లోకి రష్మిక రావడంతో గీత గోవిందం సినిమా పట్టాలెక్కింది.\

ఇవి కూడా చదవండి

గీతా ఆర్ట్స్ ట్వీట్..

గీత గోవిందం నాకు చాలా స్పెషల్

గీత గోవిందం రిలీజ్ అయ్యి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా రష్మిక కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. సినిమాలో విజయ్ తో కలిసున్న సీన్స్ ఫొటోలు షేర్ చేస్తూ.. ‘నా మొబైల్‌లో ఉన్న ఈ ఫొటోలు ఏడేళ్ల క్రితం నాటివి అంటే నమ్మలేకపోతున్నాను. గీత గోవిందం ఎప్పటికీ నాకు స్పెషల్‌ చిత్రమే.ఈ సినిమా నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ నేను గుర్తుచేసుకుంటున్నాను. మనమందరం కలుసుకుని చాలా కాలం అయింది. ఇప్పుడు వారంతా చాలా ఆనందంగా ఉన్నారని భావిస్తున్నాను. అప్పుడే ఏడేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. చిత్రబృందానికి నా అభినందనలు’ అని రష్మిక రాసుకొచ్చింది.

 రష్మిక పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *