Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అబద్ధం చెప్పే వారికి ఎలాంటి శిక్షలు పడతాయయో తెలిస్తే వెన్ను వణకాల్సిందే..

Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అబద్ధం చెప్పే వారికి ఎలాంటి శిక్షలు పడతాయయో తెలిస్తే వెన్ను వణకాల్సిందే..


Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అబద్ధం చెప్పే వారికి ఎలాంటి శిక్షలు పడతాయయో తెలిస్తే వెన్ను వణకాల్సిందే..
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

గరుడ పురాణం హిందూ మత గ్రంథంలోని 18 మహాపురాణాలలో ఒకటి. ఈ పురాణంలోని విషయాలు గరుత్మంతుడి సందేహాలను తీర్చడానికి శ్రీ మహా విష్ణువు చెప్పే సమాధానాలుగా కనిపిస్తాయి. దేహాన్ని వదిలిన అనంతరం ఆత్మ ప్రయాణం … జీవికి ఎదురయ్యే పరిస్థితులు ఈ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చేసే మంచి లేదా చెడు పనులు అన్నీ లెక్కించబడతాయి. మరణం తర్వాత వాటి ఫలాలను ఖచ్చితంగా పొందుతారు. ఇదే విషయాన్ని గరుడ పురాణం వెల్లడిస్తోంది. ఇందులో జననం నుంచి మరణం, స్వర్గం, నరకం, యమలోకం, పునర్జన్మ, అధోగతి మొదలైనవన్నీ వివరంగా వివరించబడ్డాయి.

గరుడ పురాణంలో చెప్పబడినది ఏమిటంటే.. మరణం తరువాత, చెడు పనులు చేసేవారి ఆత్మలు నేరుగా నరకానికి వెళతాయి. ఇక్కడ వారికి నేరాలకు తగిన శిక్షలు విధిస్తారు. ఎలాంటి శిక్షలను విధిస్తారనేది తెలిస్తే ఆత్మ వణికిపోతుంది. గరుడ పురాణం ప్రధానంగా 16 నరకాలను వివరిస్తుంది. ఈ 16 నరకాలలో.. పాపాల ప్రకారం శిక్షను పొందుతారు. ఎవరైనా చనిపోయినప్పుడు.. యమదూతలు అతని ఆత్మను యమ ధర్మ రాజు ఆస్థానానికి తీసుకువెళతారని.. అక్కడ త్రగుప్తుడు అతని కర్మ గురించి తెలియజేస్తాడని గరుడ పురాణం చెబుతుంది. దీని తరువాత అతని చర్యలను బట్టి అతనికి ఏమి శిక్ష విధించాలనేది నిర్ణయించబడుతుంది. కనుక జీవితంలో మంచి పనులు చేయడంతో పాటు, ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాలి. ఎవరికీ హాని చేయకూడదు.

అబద్ధం చెప్పే వారికి ఎలాంటి శిక్షలు పడతాయి.

అబద్ధం చెప్పేవారికి నరకంలో ప్రత్యేక శిక్షలు విధించే నిబంధన ఉంది. ఎవరైనా సరే అబద్ధాలు చెప్పి చాలాసార్లు తప్పించుకుని ఉండవచ్చు.. అయితే ఇలా అబద్ధాలు చెప్పి శిక్ష నుంచి ఎవరూ శాశ్వతంగా తప్పించుకుంటారని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే మరణించిన తర్వత మీ ఆత్మ మీరు చెప్పే అబద్ధాలకు యమ ధర్మ రాజు ఆస్థానంలో జవాబు చెప్పాల్సి ఉంటుంది.

అబద్ధాలు చెప్పే వాళ్ళు ఏ నరకానికి వెళ్తారంటే

యమ ధర్మ రాజు ఆస్థానంలో అబద్ధాలు చెప్పే వారి ఆత్మలను వదిలిపెట్టరు. చెప్పిన అందాలకు శిక్షించబడతారు. అబద్ధాలు చెప్పే వారిని తప్త కుంభ నరకానికి పంపిస్తారు. ఈ నరకంలో చుట్టూ అగ్ని మండుతుందని.. వేడి నూనె.. ఇనుప పొడి ఉండి కణకణమండే కుండలు ఉంటాయని చెబుతారు. యమ దూతలు అబద్ధాలు చెప్పే పాపాత్ముల ముఖాన్ని ఈ వేడి కుండలోకి పెడతారు. మండే అగ్ని లోకి పడేస్తారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *