Garuda Purana: అల్లుడితో సంబంధం పెట్టుకునే అత్తకు గరుడ పురాణం ప్రకారం ఎటువంటి శిక్షలు విధిస్తారంటే

Garuda Purana: అల్లుడితో సంబంధం పెట్టుకునే అత్తకు గరుడ పురాణం ప్రకారం ఎటువంటి శిక్షలు విధిస్తారంటే


గరుడ పురాణం హిందూ మతంలోని 18 మహాపురాణాలలో ఒకటి. ఇది ఆత్మ, పాపం-ధర్మం, కర్మ, స్వర్గం-నరకం, పునర్జన్మ .. మరణానంతర జీవి ప్రయాణం గురించి ప్రత్యేకంగా వివరిస్తుంది. గరుడ పురాణంలో జీవితంలో చేసిన కర్మలకు మరణానంతరం ఎలాంటి ఫలితం లభిస్తుందో.. ఏ రూపంలో పుడతాడో చెప్పబడింది. మనం నివసించే సమాజంలో లేదా కుటుంబంలో గౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. సంబంధాల గౌరవాన్ని అవమానించే వారికి గరుడ పురాణం శిక్షను నిర్దేశిస్తుంది. అలాంటి వ్యక్తులు మరణానంతరం ఎలాంటి శిక్షలు పొందుతారు.. మళ్ళీ ఎటువంటి జన్మ తీసుకుంటారో తెలుసుకుందాం..

తన అల్లుడితో సంబంధం పెట్టుకున్న స్త్రీ..

తరచుగా అక్రమ సంబంధాలు పెట్టుకున్న స్త్రీలకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. ఒక మహిళ తన కాబోయే అల్లుడితో పారిపోయింది. ఈ సంఘటన గురించి తెలిసిన తర్వాత ఇదే కలియుగం అంటున్నారు. గరుడ పురాణంలో కూడా ఇటువంటి చర్యలు క్షమించదగినవిగా పరిగణించబడవు. అలాంటి పాపాలు చేసేవారు లేదా సంబంధాల గౌరవాన్ని కాపాడుకోని వారు మరణానంతరం నరకంలో చోటు పొందుతారని, దారుణమైన శిక్ష విధించబడుతుందని చెప్పబడింది.

అత్త అల్లుళ్ళ సంబంధం శిక్షార్హమే..

  1. అల్లుడు, అత్తగారి మధ్య సంబంధం తల్లి కొడుకుల సంబంధం వంటిది. అలాంటి సందర్భంలో అత్తగారు తన అల్లుడిని చెడు దృష్టితో చూసినా.. లేదా అల్లుడు తన అత్తగారిపై చెడు దృష్టి పెడితే.. ఈ చర్య పవిత్రమైన సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఈ దుష్కార్యం సామాజిక నేరమే కాదు.. మతపరమైన, ప్రకృతి నియమాలకు కూడా విరుద్ధం.
  2. గరుడ పురాణం ప్రకారం మరణం తరువాత అటువంటి ఆత్మలను యమదూతలు తీవ్రమైన హింసతో మహాపాతక నరకానికి తీసుకువెళతారు. ఈ నరకంలో శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి.
  3. అత్తపై కన్నేసిన వ్యక్తి మరణం తరువాత మరు జన్మలో నపుంసకుడు అవుతాడు. అంతేకాదు తన కొడుకు భార్యతో లేదా కూతురు వరసయ్యే స్త్రీతో సంబంధం ఉన్న వ్యక్తి మరణం తరువాత కుంభిపాక నరకానికి వెళతాడు.
  4. గరుడ పురాణం ప్రకారం పవిత్ర సంబంధాలకు విరుద్ధంగా ఏ రకమైన దుష్ప్రవర్తనకు పాల్పడే వ్యక్తికైనా కఠినమైన శిక్షలు విధించబడతాయి. అది పురుషుడైనా లేదా స్త్రీ అయినా, అలాంటి ప్రవర్తన ఇద్దరికీ శిక్షార్హమైనది.
  5. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన భార్యను మరొక స్త్రీ కోసం వదిలివేస్తే లేదా ఒక స్త్రీ తన భర్తను మరొక పురుషుడి కోసం వదిలివేస్తే.. వీరు కూడా మరణానంతరం నరక బాధను అనుభవించాల్సి ఉంటుంది. వారు ఏడు జన్మల పాటు తమ జీవిత భాగస్వామి నుంచి విడిపోయి దారుణమైన కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది.
  6. గరుడ పురాణం ప్రకారం తన భర్తను విడిచిపెట్టి అల్లుడితో సంబంధాన్ని ఏర్పరచుకునే ఏ స్త్రీ అయినా ఆమె మరణించిన తర్వాత మరు జన్మలో బల్లి, గబ్బిలం లేదా రెండు తలల సర్పం గర్భంలో పుడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *