Gaddar Awards: గద్దర్ అవార్డుల వేడుక.. సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఆత్మీయ ఆలింగనం.. వీడియో ఇదిగో..

Gaddar Awards: గద్దర్ అవార్డుల వేడుక.. సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఆత్మీయ ఆలింగనం.. వీడియో ఇదిగో..


తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్ హైటెక్స్‏లో శనివారం సాయంత్రం ఘనంగా మొదలైంది. ఈ వేడకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు, ఎఫ్డీసీ ఎండీ హరీశ్ జ్యోతి ప్రజలన చేసి వేడుకను ప్రారంభించారు. అలాగే ఈ వేడుకకు సినీప్రముఖులు బాలకృష్ణ, సుకుమార్, డైరెక్టర్ మణిరత్నం, అల్లు అర్జున్, సుహాసిని, విజయ్ దేవరకొండ తదితరులు హాజరయ్యారు. పలువురు విజేతలకు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవార్డులు అందించారు. మెమొంటోతోపాటు రూ.5 లక్షలు, ప్రశంసా పత్రం అందచేశారు. పుష్ప చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ గద్దర్ అవార్డును ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ గద్దర్ అవార్డ్ అందుకోనున్నారు.

వీడియో ఇదిగో.. 

విజేతలు వీరే..
— 2024 ఉత్తమ మొదటి చిత్రం కల్కి

— 2024 రెండవ ఉత్తమ చిత్రం పొట్టేల్

— 2024 మూడవ ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్‌

— ఉత్తమ దర్శకుడు – నాగ్‌ అశ్విన్ – కల్కి

— ఉత్తమ నటుడు – అల్లు అర్జున్‌ – పుష్ప2

— ఉత్తమ గాయని – శ్రేయా ఘోషల్ – పుష్ప2

— ఉత్తమ నటి – నివేదా థామస్‌ -35 చిన్న కథ కాదు

— ఉత్తమ స్కీన్‌ ప్లే – వెంకీ అట్లూరి -లక్కీ భాస్కర్‌

— ఉత్తమ హాస్యనటులు – వెన్నెల కిషోర్‌, సత్య

— ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – గణేష్‌ ఆచార్య -దేవర

— స్పెషల్ జ్యూరీ అవార్డు – దుల్కర్‌ సల్మాన్‌ – లక్కీ భాస్కర్‌

— స్పెషల్ జ్యూరీ అవార్డు – అనన్య నాగళ్ల – పొట్టేల్‌

— స్పెషల్ జ్యూరీ అవార్డు – ఫరియా అబ్దుల్లా – మత్తు వదలరా2

— ఉత్తమ బాలల చిత్రం – 35 ఇది చిన్న కథ కాదు

— రజాకార్ చిత్రానికి ఫీచర్‌ హెరిటేజ్‌ విభాగంలో అవార్డు

— ఉత్తమ కథా రచయిత – శివ పాలడుగు

— ఉత్తమ పుస్తకం – రెంటాల జయదేవ..మన సినిమా.. ఫస్ట్ రీల్

— ఉత్తమ గీత రచయిత – చంద్రబోస్‌

ఇవి కూడా చదవండి :  

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..

Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..

Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *