Fatty Liver: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్నట్లే..

Fatty Liver: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్నట్లే..


తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, మారిన జీవన విధానం కారణం ఏదైనా ఇటీవల ఫ్యాటీ లివర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శారీరక శ్రమ తగ్గడం, కూల్‌డ్రింక్స్‌, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వంటి కారణాల వల్ల ఫ్యాలీ లివర్‌ సమస్య వేధిస్తోంది. అయితే ఈ సమస్యను ఎక్కువ కాలం వదిలేస్తే ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా ఫ్యాటీ లివర్‌తో బాధపడితే ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. అందుకే ఫ్యాటీ లివర్‌ సమస్యను త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ సమస్య నుంచి ఇట్టే బయటపడొచ్చు. ఫ్యాటీ లివర్‌ సమస్యను కొన్ని ముందస్తు లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఆకలిగా లేకపోవడం ఫ్యాటీ లివర్‌ సమస్య లక్షణంగా చెప్పొచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో తినాలనే కోరిక బాగా తగ్గిపోతుంది. అలాగే ఉన్నపలంగా బరువు తగ్గుతున్నా అది ఫ్యాటీ లివర్‌కు సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.

* సాధారణంగా ఏదైనా పని చేస్తే అలసట రావడం సర్వసాధారణమైన అంశం. అయితే ఎలాంటి శ్రమ లేకున్నా త్వరగా అలసిపోతుంటే మాత్రం ఫ్యాటీ లివర్‌ సమస్యగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో శక్తి లేనట్టు అనిపిస్తున్నా అది ఫ్యాటీ లివర్ కు కారణం కావచ్చు.

* ఫ్యాటీ లివర్‌ వస్తే మరో ప్రధాన లక్షణాల్లో పొట్ట కుడి భాగంలో నొప్పి ఉండడం ఒకటి. కడుపు కుడి భాగంలో అస్పష్టంగా నొప్పి లేదా అసౌకర్యం ఏర్పడుతుంటే దాన్ని కూడా ఫ్యాటీ లివర్ లక్షణంగా పరిగణిస్తారు.

* ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్న వారిలో శరీరంలోకి నీరు చేరుతుంది. ముఖ్యంగా పొట్ట లేదా కాళ్లలో నీరు చేరుతుంది. దీంతో ఇది వాపునకు దారి తీసే అవకాశాలు ఉంటాయి.

* ఈ సమస్య ఉంటే చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. పదేపదే కామెర్ల సంఖ్య భారిన పడుతుంటే ఫ్యాటీ లివర్‌ సమస్య బారినపడినట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.

* ఫ్యాటీ లివర్‌ సమస్య కాకరణంగా మానసిక సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఏకాగ్రత లోపించడం, మానసికంగా గందరగోళానికి గురి కావడం వంటివి కూడా ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *