Exchange Traded Fund: ETFలలో స్మార్ట్ బీటా స్ట్రాటజీ ఎలా పని చేస్తుంది?

Exchange Traded Fund: ETFలలో స్మార్ట్ బీటా స్ట్రాటజీ ఎలా పని చేస్తుంది?


పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు తమ పథకాలలో కొత్త పథకాలను అమలు చేస్తూనే ఉంటాయి. దీని కింద పెట్టుబడిదారులకు కొత్త పెట్టుబడి స్టాటజీలను పరిచయం చేస్తారు. అదేవిధంగా ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో పెట్టుబడిదారులను ఆకర్షించడానికి స్మార్ట్ బీటా అనే స్ట్రాటజీ ఉపయోగించబడుతుంది. స్మార్ట్ బీటా ఇటిఎఫ్ అనేది ఫండ్ మేనేజర్లు కొన్ని కారకాల ఆధారంగా స్టాక్‌లను ఎంచుకునే ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజీ. ఈ స్మార్ట్ బీటా స్ట్రాటజీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో ఎలా పని చేస్తుందో, పెట్టుబడిదారుడికి లాభదాయకంగా ఉంటుందో చూద్దాం.

ETFలలో స్మార్ట్ బీటా స్ట్రాటజీ ఎలా పని చేస్తుంది?

స్మార్ట్ బీటా అనేది ఫండ్ మేనేజర్లు నిర్దిష్ట కారకాల ఆధారంగా ETF స్టాక్‌లను ఎంచుకునే పెట్టుబడి వ్యూహం. బేర్ ఇటిఎఫ్‌లు ఫండ్ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తాయి. కానీ ఈ స్మార్ట్ బీటా ఈటీఎఫ్‌లలో ఫండ్ మేనేజర్ నిర్దిష్ట పాలసీ లేదా స్ట్రాటజీ ఆధారంగా ఇండెక్స్‌తో పాటు కొన్ని స్టాక్‌లను ఎంచుకుంటారు. అంటే స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లో విలువ, డివిడెండ్, మొమెంటం, నాణ్యత, తక్కువ అస్థిరత కారకం. ఆల్ఫా, ప్రాథమిక కారకాల ఆధారంగా ఇండెక్స్‌లో చేర్చిన స్టాక్‌లు ఎంపిక చేయబడతాయి. ఉదాహరణకు, నిఫ్టీ ఇండెక్స్‌లో 50 స్టాక్‌లు ఉంటే, ఫండ్ మేనేజర్ కొన్ని అంశాల ఆధారంగా వీటిలో 10 స్టాక్‌లను మాత్రమే ఎంచుకుని, ఆ స్టాక్‌లలో పెట్టుబడి పెడతారు.

ఇది కూడా చదవండి: ETF Invest: ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం ఏది?

ఇటువంటి స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు సాధారణ ఇటిఎఫ్‌ల కంటే అధిక రాబడిని అందిస్తాయి. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు సాధారణ ఇండెక్స్ లాగా బెంచ్‌మార్క్‌లలోని అన్ని స్టాక్‌లలో పెట్టుబడి పెట్టకపోవడమే. ఇది ఆల్ఫా లేదా మొమెంటం ఫిల్టర్‌లను వర్తింపజేయడం ద్వారా స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం. ఇది మరింత ఆదాయాన్ని సంపాదించడానికి ఒక వ్యూహంగా పనిచేస్తుంది.

ఇది కూడా చదవండి: Smart BETA Funds: స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *