ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చిన కరుణ్ నాయర్ తన మనసులోని భావాలను బహిర్గతం చేశాడు. 2017లో చివరిసారి టెస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన నాయర్, ఇప్పుడు 2024-25 దేశవాళీ సీజన్లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ ఫామ్‌ను చూపించిన నాయర్, రంజీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్‌ల్లో నాలుగు శతకాలు సహా 863 పరుగులు, విజయ్ హజారే ట్రోఫీలో ఎనిమిది ఇన్నింగ్స్‌లలో ఐదు శతకాలు సహా 779 పరుగులు చేసి తన అర్హతను నిరూపించాడు. ఈ ప్రదర్శనలే అతని మళ్లీ జాతీయ జట్టులోకి రావడానికి మార్గం సుగమం చేశాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌పై ఆరు వికెట్ల విజయంలో కీలకంగా 27 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపిన నాయర్, మ్యాచ్ అనంతరం తన హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశాడు. “తిరిగి రావడం గర్వంగా ఉంది. చాలా సందేశాలు వచ్చాయి, చాలా ఆనందంగా ఉంది. ఈ పిలుపు కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. గత 12-16 నెలలుగా బాగా బ్యాటింగ్ చేస్తున్నాను. అదే ప్రక్రియను కొనసాగించాను. నేను చేస్తున్న పనులే చేస్తూ కొనసాగాను” అని అతను చెప్పాడు.
విదర్భ తరఫున రంజీ ట్రోఫీ గెలుపులో నాయర్ కీలక పాత్ర పోషించాడు. అతని బలమైన ప్రదర్శనకు ఫలితంగా, భారత జట్టులో తిరిగి స్థానం సంపాదించాడు. ఇంతకాలం తన ఫామ్‌ను నిరూపించేందుకు, తిరిగి పిలుపు కోసం ఎదురు చూసిన నాయర్ ఇప్పుడు తన ఆటతీరుతో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
అంతేకాదు, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయినా, చివరి మ్యాచ్‌లో గెలిచినందుకు నాయర్ ఆనందం వ్యక్తం చేశాడు. “మేము మంచి టీం, కానీ ఈ సీజన్లో మా అత్యుత్తమ ఆట తేలలేదు. అయినా ఈ రాత్రి గెలుపుతో మేము మంచి జట్టు అని నిరూపించుకున్నాం” అని నాయర్ అన్నారు.
ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు సమీర్ రిజ్వీ తన తొలి ఐపీఎల్ అర్ధ సెంచరీతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నప్పటికీ, మిడిల్ ఓవర్లలో కరుణ్ నాయర్ ఇచ్చిన మద్దతు జట్టుకు ఎంతో కీలకంగా మారింది. “టోర్నమెంట్లోకి నేను చాలా పరుగులతో వచ్చాను. ఆత్మవిశ్వాసంతో బంతిని బాగా హిట్ చేస్తున్నాను. కొచ్లు నా వద్ద ఎక్కువ సమయం కేటాయించారు, పెద్ద షాట్లు ఆడమని ప్రోత్సహించారు. దాంతో నేను దూకుడుగా షాట్లు ఆడగలగుతున్నాను” అని నాయర్ అన్నాడు.
ఇక ఈ మళ్లీ భారత జట్టులోకి వచ్చి నిలిచే అవకాశం పొందాలంటే, నాయర్ తన నాణ్యతను ఇలాగే నిరూపిస్తూ కొనసాగించాల్సిందే. ఓ టైమ్‌లో ట్రిపుల్ సెంచరీ చేసినప్పటికీ టీమ్ నుండి తప్పించబడ్డ కరుణ్, ఇప్పుడు తనను నిరూపించుకునే మరో గొప్ప అవకాశాన్ని గట్టిగా పట్టుకోవాలని చూస్తున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..