Eluru: కొబ్బరి బొండం సైజులో మారేడుకాయలు.. విస్తుపోతున్న స్థానికులు

Eluru: కొబ్బరి బొండం సైజులో మారేడుకాయలు.. విస్తుపోతున్న స్థానికులు


వినాయక చవితి రోజున బిల్వపత్రం, మారేడు కాయలు తప్పనిసరిగా పూజలో ఉంచాలి. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు కాయలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. మారేడు గుజ్జు చాలా సువాసన భరితంగా ఉంటుంది. సాధారణంగా మారేడు జామకాయ అంత ఉంటాయి. కానీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వేగేశ్న కృష్ణంరాజు పెరడులోని మారేడు చెట్టుకు పెద్ద పెద్ద మారేడు కాయలు కాశాయి. ఒక్కొక్క మారేడు కాయ కొబ్బరికాయ సైజులో తయారైంది. భారీ సైజులో ఉన్న మారేడు కాయలను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం చెందిన వేగేశ్న కృష్ణంరాజు, సత్యవతి కుమారి దంపతులు మొక్కలను అపురూపంగా పెంచుతారు. సంవత్సరం క్రితం తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి మారేడు మొక్కను తెచ్చి తమ పెరట్లో నాటారు. సంవత్సరం తర్వాత ఆ మొక్క కాయలను కాసింది. ఆ కాయలను చూసిన కృష్ణంరాజు సత్యవతి కుమారి దంపతులు.. ఆనందం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎవరు ఊహించని సైజులో పెద్ద పెద్ద మారేడు కాయలు కాయడంతో చుట్టుపక్కల వారు వాటిని చూసేందుకు వస్తున్నారు. తమ జీవితంలో ఎప్పుడు ఇంత పెద్ద మారేడు కాయలను చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మారేడు చెట్టు చాలా పవిత్రమైనది. మారేడు ఆకులను బిల్వపత్రాలు అంటారు. బిల్వపత్రాలు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. పరమేశ్వరుని అభిషేకంలో, అర్చనలో బిల్వపత్రాలను ఉంచుతారు. మారేడు చెట్టుకు పూజ చేస్తే సంపదకు లోటు ఉండదు. మారేడు చెట్టును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తారు. మారేడు లేదా బిల్వ వృక్షం అంతా ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ప్రతి భాగము మానవాళికి మేలు చేస్తుంది. మారేడు కాయలు, పూలు, బెరడు, వేళ్ళు అన్నీ కూడా ఔషధాలుగా ఉపయోగపడతాయి. మారేడు కాయలో మినరల్స్, విటమిన్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, ఇలా చాలా ఉంటాయి. అతిసార వ్యాధికి, మొలలకు, ప్రేగులలోను పుండ్లు తగ్గించడానికి, రక్త సంబంధిత వ్యాధులు తగ్గించడానికి మారేడు కాయలు, బిల్వపత్రాలు ఉపయోగపడతాయి. క్రిమి కీటకాల విషం విరుగుడుకు మారేడు బాగా పని చేస్తుంది. అందుకే పూర్వకాలంలో ప్రతి ఒక్కరి ఇంటి పెరట్లో మారేడు చెట్టును పెంచేవారు. పూజలలో, ఔషధాలు మారేడును ఎక్కువగా వాడేవారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *