ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. విటమిన్లు,ఖనిజాలు, అధిక నాణ్యత ప్రోటీన్లతో సమృద్ధిగా ఉన్న గుడ్డు మంచి పోషకమైన ఆహారం. ప్రతిరోజూ గుడ్డు తినటం వల్ల చర్మానికి మంచిది. దీనివల్ల ప్రోటీన్ కూడా పుష్కలంగా అందుతుంది. కంటి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. కానీ, కొందరికి మాత్రం గుడ్డు విషంతో సమానం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి వ్యక్తులు గుడ్లు తీసుకోవడం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు చూపిస్తాయని చెబుతున్నారు. అయితే ఇది ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికి కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు దీని తీసుకోవడం మంచిది కాదు. ఎవరు గుడ్డు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు గుడ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంతే కాదు గుడ్డులో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు గుడ్లు తీసుకోకూడదు, ప్రధానంగా గుడ్డులోని పచ్చసొనకు మరింత దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, కొంతమంది గుడ్డు తినప్పుడు అలర్జీ కలుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు గుడ్డును తీసుకోవడం మంచిది కాదు. అలాగే మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు కూడా గుడ్డు తీసుకోవడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే, ఊబకాయంతో బాధపడుతున్న వారు కూడా గుడ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే తరచూ గుడ్డు తినటం వల్ల ఇది మరింత బరువును పెంచుతుంది. అలాగే, డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు కూడా సాధ్యమైనంత తక్కువ మోతాదులోనే గుడ్లు తీసుకోవాలని చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు కడుపు సమస్యలతో బాధపడుతున్న వారు గుడ్లు తక్కువగా తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలున్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..