Dry Fish Curry: టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!

Dry Fish Curry: టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!


ఎండు చేపల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎండు చేపలతో కర్రీ చేసినా, ఫ్రై చేసినా చాలా రుచిగా ఉంటాయి. ఇంతకు ముందు ఎక్కువగా ఎండు చేపలతో కూరలు తయారు చేసేవారు. ఈ మధ్య కాలంలో చాలా వరకు తగ్గింది. ఎండు చేపలు తినడం కూడా ఆరోగ్యానికి మంచిదే. ఎండు చేపలతో కూర చాలా రుచిగా ఉంటుంది. ఎలాంటి వెజిటేబుల్స్ వేసి అయినా ఎండు చేపలతో కర్రీలు చేయవచ్చు. ఎండు చేపలతో ఎక్కువగా ఈజీగా అయిపోయే కర్రీ రెగ్యులర్‌గా చేస్తూ ఉంటారు. ఆంధ్ర ప్రదేశ్ సైడ్ ఎక్కువగా ఈ కర్రీ చేస్తారు. అదే టమాటా ఎండు చేపల కర్రీ. వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. తక్కువ సమయంలోనే చాలా సింపుల్‌గా చేసేయవచ్చు. మరి ఈ టమాటా ఎండు చేపల కర్రీ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

టమాటా ఎండు చేపల కర్రీకి కావాల్సిన పదార్థాలు:

ఎండు చేపలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, చింత పండు, ఆయిల్.

టమాటా ఎండు చేపల కర్రీ తయారీ విధానం:

ఎండు చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసి ఓ పది నిమిషాల పాటు వేడి నీటిలో వేసి నానబెట్టాలి. ఇప్పుడు కర్రీ పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఎండు చేపలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి కలర్ మారేంత వరకు ఉడికించు కోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి.

ఇవి కూడా చదవండి

టమాటా మెత్తగా అయ్యాక కారం, పసుపు, ఉప్పు వేసి ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఎండు చేప ముక్కలు కూడా వేసి ఓ నిమిషం వేయించి.. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు కొద్దిగా చింత పండు గుజ్జు వేసి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి. కూర దగ్గర పడుతున్న సమయంలో మసాలా పొడి, కొత్తి మీర వేసి కాసేపు మగ్గనించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉంటే టమాటా ఎండు చేపల కర్రీ సిద్ధం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *