Droupadi Murmu: భారతదేశాన్ని గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu: భారతదేశాన్ని గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము


పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.  అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో రైతులు, సైనికులు, సైన్స్‌తో పాటు పరిశోధనలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్‌గా మార్చడమే మా లక్ష్యం. దేశంలోని విద్యా సంస్థల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు 50 వేల కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించాము. మధ్యతరగతి గృహాలు, గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అలాగే చిన్న వ్యాపారులకు సైతం రుణాలను రెట్టింపు చెసినట్లు చెప్పారు.

మహాకుంభ్‌లో ఉత్సవం జరుగుతోందని, మౌని అమావాస్య నాడు జరిగిన ప్రమాదం పట్ల నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని అన్నారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పిస్తున్నానని అన్నారు. భారతదేశంలో నిర్మించిన గగన్‌యాన్‌లో భారతీయ పౌరుడు అంతరిక్షంలోకి వెళ్ళే రోజు ఎంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల క్రితం స్పేస్ డాకింగ్‌లో విజయం సాధించడం వల్ల భారతదేశం తన స్వంత స్పేస్ స్టేషన్‌ను కలిగి ఉండటానికి మార్గం మరింత సులభతరం చేసిందన్నారు.

దేశంలో మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని తమ ప్రభుత్వం విశ్వసిస్తుందన్నారు. విద్యకు ఎవ్వరు కూడా దూరంగా ఉండకూదనే ఉద్దేశంతో మాతృభాషలో విద్యకు అవకాశాలు అందిస్తున్నామన్నారు. 13 భారతీయ భాషల్లో వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహించడం ద్వారా భాష సంబంధిత అడ్డంకులు తొలగుతాయని భావించామని, అందుకే భాషా పరంగా ప్రాముఖ్యత ఇచ్చామన్నారు రాష్ట్రపతి ముర్ము. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా కల్పించాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు.

ఇవి కూడా చదవండి

యువత విద్య, వారికి కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తోందన్నారు. మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం కూడా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోంది. దేశం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని, మోదీ మూడో టర్మ్‌లో దేశంలో 3 రెట్లు వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు.


మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *