కలలో కాకి కనిపిస్తే రాబోయే మార్పుల గురించి సూచనగా భావించవచ్చు. ఈ మార్పులు మీరు ఊహించని విధంగా ఉండొచ్చు. ఒకవేళ మీ కలలో కాకి మాట్లాడుతుంటే.. మీరు దాచిన ఒక విషయం తొందర్లోనే బయటపడుతుంది అని అర్థం. అది మీ వ్యక్తిగత విషయాలు కావచ్చు, కుటుంబానికి సంబంధించినది కావచ్చు లేదా ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు. ఈ నిజం బయటపడటం వల్ల మీరు బాధపడవచ్చు. అందుకే మీరు ముందుగానే మీ మనసును సిద్ధం చేసుకోండి.
పావురం అంటే స్నేహం, శాంతి, ప్రేమ, శుభవార్తకు చిహ్నంగా భావించబడుతుంది. తెల్ల పావురం కలలో కనిపిస్తే అది మీ జీవితంలో శుభ సంఘటనలు జరగబోతున్నాయని సూచిస్తుంది. ముఖ్యంగా కుటుంబ జీవితం ఆనందంగా మారే అవకాశం ఉంటుంది.
కలలో గాయపడిన పావురం కనిపిస్తే.. అది ఎవరితోనైనా మీరు భావోద్వేగంగా దూరంగా ఉన్నారని తెలియజేస్తుంది. ఇది కొంత గందరగోళాన్ని సూచించవచ్చు. ఇలాంటి పరిస్థితిని వెంటనే గమనించి.. సమస్య పరిష్కారానికి ముందడుగు వేయడం అవసరం.
చిలుక అంటే మామూలుగా అందరితో బాగా మాట్లాడే స్వభావానికి గుర్తుగా చూస్తారు. కలలో చిలుక కనిపిస్తే మీరు మీ మనసులో ఉన్న విషయాలను వేరే వాళ్లకు సరిగ్గా చెప్పలేకపోతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ కల ఒక సూచనగా తీసుకొని.. మీ మాట తీరును మెరుగుపరుచుకోవాలి. ఒకవేళ రంగురంగుల చిలుక కనిపిస్తే.. మీరు కొత్త ఆలోచనలతో నిండి ఉన్నారని, కొత్త పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. మీ కళలకు సంబంధించిన పనులు లేదా కొత్త విషయాల మీద శ్రద్ధ పెట్టండి. ఇది మీకు సంతోషాన్నిస్తుంది.
కొన్నిసార్లు కలలు మన మనసులో ఉన్న విషయాల వల్ల వస్తాయి. అవి నిజమైన సూచనల్లా అనిపించినా.. వాటిని పూర్తిగా నమ్మడం కరెక్ట్ కాదు. మన పరిస్థితులు, మనసు ఎలా ఉందో, మనం ఎలా జీవిస్తున్నామో అనే విషయాలు కలలపై ప్రభావం చూపిస్తాయి.
కలలో కాకి కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. పావురం కనిపిస్తే శాంతి, ఆనందం రాబోతోంది. చిలుక కనిపిస్తే కమ్యూనికేషన్ లేదా సృజనాత్మకతపై దృష్టి పెట్టాలి. ఎలాంటి కల చూసినా దానిని నెగెటివ్ గా కాకుండా ఒక సూచనగా తీసుకోవాలి.