Headlines

Dream: కలలో బంగారం కనిపించిందా.? మీ జీవితంలో జరిగే మార్పు ఇదే..

Dream: కలలో బంగారం కనిపించిందా.? మీ జీవితంలో జరిగే మార్పు ఇదే..


బంగారం అనగానే ఐశ్వర్యానికి, లక్ష్మీకి ప్రతీకగా భావిస్తుంటాం. విలువైన వస్తువులను దేనినైనా బంగారంతో పోలుస్తుంటాం. అలాంటి బంగారం కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది.? ఎలాంటి సంకేతాన్ని ఇచ్చేందుకు బంగారం కలలో కనిపిస్తుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన ప్రమేయం లేకుండా వచ్చే కలలు మన జీవితంపై ప్రభావం చూపుతాయని పండితులతో పాటు, మానసిక నిపుణులు సైతం చెబుతుంటారు. అలాంటి బంగారం కలలో కనిపిస్తే జరిగే పరిణామాలివే..

* మీరు ఒంటిపై ధరించిన బంగారాన్ని చూసుకుంటున్న కల వస్తే మీకు ఏదో అదనపు బాధ్యత వస్తోందని అర్థం చేసుకోవాలి. అయితే మీరు ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వరిస్తారని శాస్త్రం చెబుతోంది.

* ఇక ఒకవేళ ఒకచోట కుప్పగా ఉన్న బంగారు ఆభరణాలు కలలో కనిపిస్తే మీరు భవిష్యత్తులో చాలా ఖర్చు చేయాల్సి వస్తుందని అర్థం చేసుకోవాలని అంటున్నారు. మీకు తెలియకుండానే ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

* నగలు పోగొట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఆర్థిక నష్టం తప్పదని అంటున్నారు. వ్యాపారంలో ఏదో నష్టం వచ్చే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి కలలు వస్తే జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

* బంగారం దొరికినట్లు కలలో కనిపిస్తే అది అశుభానికి సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు. వ్యాపర భాగస్వాములతో వివాదలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

* దుకాణంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు కనిపిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కెరీర్‌ విషయంలో ఏదో సక్సెస్‌ను అందుకోబోతున్నారనడానికి ఇది ఒక సూచికగా చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం కొందరు పండితులు తెలిపిన విషయాలు, శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *