Headlines

Dhanush : ఒక లెజెండ్‏తో నటించడం నా అదృష్టం.. నాగార్జున పై ధనుష్ ప్రశంసలు..

Dhanush : ఒక లెజెండ్‏తో నటించడం నా అదృష్టం.. నాగార్జున పై ధనుష్ ప్రశంసలు..


కోలీవుడ్ హీరో ధనుష్ సినిమాలకు తెలుగులోనూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన నటించిన సినిమాల కోసం ఫ్యా్న్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ధనుష్ నటిస్తోన్న సినిమాలపై భారీ హైప్ నెలకొంది. ప్రస్తుతం డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు హీరో ధనుష్.

ధనుష్ మాట్లాడుతూ.. “నా చిన్నప్పటి నుంచి నాగార్జున నటనను చూస్తూ ఆయనను ఎంతో ఆరాధిస్తున్నాను. అలాంటిది ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం నాకు చాలా గౌరవంగా ఉంది. తమిళంలో ఆయన నటించిన ‘రక్షకన్’ చిత్రం నాకు చాలా ఇష్టమైన సినిమా. నేను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగిన వ్యక్తితో కలిసి నటించడం నా అదృష్టం. ఇది నాకు గర్వకారణమైన క్షణం. ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అనుభవాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను” అని అన్నారు.

నాగార్జున లాంటి లెజెండ్ ను చూసి తాను ఆశ్చర్యపోయానని.. ఆయన సినిమాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్ అని అన్నారు. అంత గొప్ప నటుడితో నటించం చాలా గర్వంగా ఉందని.. షూటింగ్ సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు. ఈ సినిమా అనుభవం తనపై శాశ్వత ముద్ర వేసిందని అన్నారు.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *