Dewald Brevis : 6,6,6,6,6,6తో చెలరేగిపోయిన జూనియర్ ఏబీ.. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

Dewald Brevis : 6,6,6,6,6,6తో చెలరేగిపోయిన జూనియర్ ఏబీ.. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ


Dewald Brevis : సౌతాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రేవస్ క్రికెట్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తున్నాడు. ఈ 22 ఏళ్ల యువ ఆటగాడు ఇప్పుడు ఆస్ట్రేలియాపై మూడో టీ20 మ్యాచ్‌లో మరో విధ్వంసక హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 26 బంతుల్లోనే 53 పరుగులు చేసి, తనదైన స్టైల్లో ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 భారీ సిక్సులు కొట్టడం విశేషం. జూనియర్ ఏబీ డివిలియర్స్ అని పిలుచుకునే బ్రేవస్, ఇదే సిరీస్‌లో ఇంతకుముందు ఓ సెంచరీ కూడా సాధించాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మూడో, చివరి టీ20 మ్యాచ్ కైర్న్స్ మైదానంలో జరిగింది. ఈ సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో, ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అలాంటి క్లిష్ట సమయంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రేవస్ మొదట నెమ్మదిగా ఆడాడు. తన మొదటి 10 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత గేర్ మార్చి, తర్వాతి 16 బంతుల్లోనే 42 పరుగులు సాధించి తన తుఫాన్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. అతను కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి, ఆస్ట్రేలియాపై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌గా తన రికార్డును తానే అధిగమించాడు. ఈ సిరీస్‌లో ఇంతకుముందు అతను 25 బంతుల్లోనే ఫస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో బ్రేవస్ బ్యాటింగ్ స్ట్రోక్స్‌లో హైలైట్ 10వ ఓవర్. ఆస్ట్రేలియా బౌలర్ ఆరోన్ హార్డీ వేసిన ఆ ఓవర్లో బ్రేవస్ ఒంటరిగా 26 పరుగులు సాధించాడు. ఆ ఓవర్లో ఒక వైడ్ బాల్ కూడా రావడంతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. హార్డీ ఓవర్లో మొదటి రెండు బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత బ్రేవస్ వరుసగా నాలుగు సిక్సులు బాది ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ ఇన్నింగ్స్‌లో బ్రేవస్ 26 బంతుల్లో 203 స్ట్రైక్ రేట్‌తో 53 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, ఆరు సిక్సులు ఉన్నాయి.

ఒకే సిరీస్‌లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో, బ్రేవస్ భవిష్యత్తులో దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఒక గొప్ప ఆశాకిరణంగా మారనున్నాడు. అతని షాట్ సెలక్షన్స్, స్టైల్ చూస్తుంటే క్రికెట్ అభిమానులకు ఏబీ డివిలియర్స్‌ను గుర్తు చేస్తున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *