Devara Movie: ‘దేవర’ సక్సెస్ మీట్ క్యాన్సిల్.. అభిమానులకు నిర్మాత నాగవంశీ క్షమాపణలు..

Devara Movie: ‘దేవర’ సక్సెస్ మీట్ క్యాన్సిల్.. అభిమానులకు నిర్మాత నాగవంశీ క్షమాపణలు..


ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న సినిమా దేవర. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో తారక్ డ్యూయల్ రోల్ అదరగొట్టారు. చాలా కాలం తర్వాత సోలోగా అడియన్స్ ముందుకు వచ్చి మెప్పించారు. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ కాగా.. బైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషించగా.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ వేరెలెవల్ అని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే.. దేవర సక్సెస్ మీట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై నిర్మాత నాగవంశీ పోస్ట్ పెట్టారు. ఈ ఈవెంట్ ను భారీగా నిర్వహించాలని అనుకున్నప్పటికీ అనుమతులు లభించలేదని తెలిపారు. సక్సెస్ మీట్ నిర్వహించలేకపోతున్నందుకు క్షమాపణలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

“దేవరను ఈ స్థాయిలో ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేకపోవడంతో విజయోత్సవ వేడుకనైనా ఘనంగా చేయాలని ఎన్టీఆర్ ఎంతో భావించారు. మేము ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ దసరా, దేవీ నవరాత్రి ఉత్సవాలు ఉన్న కారణంగా మా వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వేదికలకు అనుమతులు పొందలేకపోయాం. ఈ పరిస్థితి మా నియంత్రణలో లేదు. ఈ ఈవెంట్ నిర్వహించలేకపోతున్నందుకు అభిమానులకు క్షమాపణలు కోరుతున్నాం. వేదిక అనుమతి కోసం మేము ఇంకా ప్రయత్నిస్తునే ఉన్నాం. మీ ప్రేమతో ఎన్టీఆర్ మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను” అని పోస్ట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *