ఢిల్లీలో వడగళ్లతో కుంభవృష్టి కురిసింది. ముందుగా రెడ్ అలర్ట్ జారీ చేసినట్లుగా వరుణుడు విరుచుకుపడ్డాడు. ఈదురు గాలులతో కూడిన వర్షం, ఆ వెంబడే వడగళ్లు పడటంతో ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సఫ్దర్‌గంజ్ ఏరియాలో గంటకు 79 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయగా, సెంట్రల్ ఢిల్లీ, గోల్ మార్కెట్, లోడి రోడ్‌లో కూడా వడగండ్లు పడ్డాయి.
మెట్రో ట్రాక్‌పై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులు, వడగళ్ల వాన కారణంగా మెట్రో రైల్ సేవలకు అంతరాయం ఏర్పడింది, ట్రైన్స్ ఆలస్యం నడిచాయి.
చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. అసోం రాష్ట్రంలోని గువహటిలో జోరు వానలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి జనావాసాలు కాస్తా.. జలావాసాలుగా మారాయి.
ఇవి కూడా చదవండి
యూపీలోని గోరఖ్‌పూర్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
నైరుతి రుతుపవనాలు మరో రెండు మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ.
ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ, ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఈదురుగాలులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..