చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ 213/5 పరుగులు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి(62), బెతెల్(55) ఆకాశమే హద్దుగా చెలరేగారు. సీఎస్కే బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగులు సాధించారు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ప్రభావం చూపలేకపోయారు. చివర్లో షెపర్డ్(53 నాటౌట్) హాఫ్ సెంచరీతో విధ్వంసం సృష్టించారు. ఖలీల్ వేసిన 19వ ఓవర్‌లో ఏకంగా 33 పరుగులు బాదారు. ఈ సీజన్‌లో ఒకే ఓవర్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.
ఈ విండీస్ వీరుడి ఊచకోతకు వరుసగా 6,6,4,6,6NB,0,4 వచ్చాయి. చెన్నై బౌలర్లలో పతిరణ 3 వికెట్లు, కరణ్, నూర్ తలో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌తో పాటు టీ20 క్రికెట్ చరిత్రలో 3 ఓవర్లలోనే 65 పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇతను వేసిన 19 ఓవర్‌లో 33 రాబట్టాడు బెంగళూరు బ్యాటర్ షెపర్డ్. అలాగే 14 బంతుల్లో ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ నమోదు చేసి రికార్డుల్లోకి ఎక్కాడు షెపర్డ్. ఈ లిస్టులో జైస్వాల్(13 బంతుల్లో), కెఎల్ రాహుల్(14 బంతుల్లో) మొదటి, రెండు స్థానాల్లో ఉన్నారు.
— Suhana (@blazekohlii) May 3, 2025
ROMARIO SHEPHERD! ⚡️
That’s it. That’s the tweet. 🙇♂️
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 3, 2025