Coolie Movie: ‘కూలీ’ లో నాగ్ పాత్ర కోసం ముందుగా టాలీవుడ్ స్టార్ హీరోను అనుకున్నారా? ఎందుకు వద్దన్నారంటే?

Coolie Movie: ‘కూలీ’ లో నాగ్ పాత్ర కోసం ముందుగా టాలీవుడ్ స్టార్ హీరోను అనుకున్నారా? ఎందుకు వద్దన్నారంటే?


రజనీకాంత్ ‘కూలీ’ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ విస్తృతంగా జరుగుతున్నాయి. ఇటీవల చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో కూలీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అలాగే హైదరాబాద్ లోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ‘కూలీ’ సినిమాలో రజనీకాంత్ దేవ్ అనే పాత్రలో కనిపించనున్నారు. అయితే రజనీ రోల్ కంటే ఇప్పుడు అందరి నోటా ఒకటే క్యారెక్టర్ గురించి వినిపిస్తోంది. అదే కింగ్ నాగార్జున చేసిన సైమన్ పాత్ర. ఇది విలన్ రోల్ అయినప్పటికీ చాలా రోజుల తర్వాత నాగార్జున చాలా స్టైలిష్ గా కనిపించారు. ఇక ట్రైలర్ లోనూ నాగ్ హైలెట్ గా నిలిచారు. ఓ వైపు కూల్ గా నవ్వుతూనే భయపెట్టేశారు. ఇటీవలే కుబేర లో ఓ డిఫరెంట్ రోల్ లో నటించి ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేసిన నాగ్ ఇప్పుడు కూలీ మూవీలో ఫుల్ టైమ్ విలన్ గా కనిపించనున్నారని సమాచారం. అయితే కూలీ సినిమాలో నాగార్జున పోషించిన స్టైలిష్ విలన్ పాత్రకు ముందుగా నాగ్ కాకుండా ఒక టాలీవుడ్ స్టార్ హీరోను అనుకున్నారట. అయితే ఎందుకోగానీ ఆయన ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదట. దీంతో నాగ్ వద్దకు రావడం, ఆయన వెంటనే ఓకే చెప్పడం చకా చకా జరిగిపోయాయట. ఇంతకీ సైమన్ పాత్ర ను మిస్ చేసుకున్న ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? నందమూరి బాలకృష్ణ.

అవును .. సైమన్ రోల్ కోసం నాగార్జున కంటే ముందుగా నందమూరి బాలకృష్ణ ని అడిగారట. కానీ కొన్ని కారణాలతో బాలయ్య ఈ సినిమాను వద్దనుకున్నారట. ఇక ఆ తర్వాత నాగార్జున ని సంప్రదించడం, ఆయన ఒకటికి ఆరు సార్లు కథ విని ఓకే చెప్పడం తో కూలీ సినిమా పట్టాలెక్కింది.

ఇవి కూడా చదవండి

కూలీ సినిమాలో రజనీ కాంత్, నాగార్జునలతో పాటు ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, రచితా రామ్, పూజా హెగ్డే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *