భారతీయ సినిమా ప్రపంచంలో పౌరాణిక కథలు, రొమాంటిక్ కామెడీ సినిమాలు తమదైన ముద్ర వేశాయి. లైవ్-యాక్షన్ బ్లాక్‌బస్టర్స్ సాధించిన సినిమాలు అనేకం ఉన్నాయి. కానీ బాక్సాఫీస్ ఆధిపత్యాన్ని సాధించే యానిమేటెడ్ చిత్రం చాలా అరుదు. హోంబాలే ఫిల్మ్స్ , క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన, మహావతార్ నరసింహ సినిమా చరిత్రను తిరిగి రాస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు వసూలు చేసింది. 2025 జూలై 25న విడుదలైన మహావతార్ నరసింహ ఐదు భారతీయ భాషలలో 3Dలో విడుదలై అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం కేవలం 26 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 280 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లు దాటిన తొలి భారతీయ యానిమేటెడ్ చిత్రంగా కూడా నిలిచింది.
వాణిజ్యపరంగా విజయం సాధించడమే కాకుండా, ఇది యానిమేషన్‌లో భారతీయ సినిమా ఇమేజ్‌ను నెలకొల్పింది. అత్యాధునిక యానిమేషన్ టెక్నాలజీతో సాంప్రదాయ పురాణాలను కలిపి ఈ సినిమాను రూపొందించారు. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గ్రాండ్ విజువల్స్, భావోద్వేగ కథ, పౌరాణిక మూలాల నుండి తీసుకున్న అంశాలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.
విష్ణువుకు సంబంధించిన పది అవతారాల ఆధారంగా సినిమాలను రూపొందించనున్నట్లు హోంబాలే ప్రకటించింది. మహావతార్ పరశురామ్ (2027), మహావతార్ రఘునందన్ (2029), మహావతార్ ద్వారకాధీష్ (2031), మహావతార్ గోకులానంద (2033), మహావతార్ కల్కి (2037), (20375) తో రెండు-భాగాల ముగింపుతో సినిమాలను తీసుకురానున్నారు.
ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..