Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..

Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..


పాములు అంటేనే అందరికీ భయమే. పాము పేరు చెబితే చాలు అక్కడ ఉండేందుకు భయపడతారు. ఒకవేళ పాములు కనిపించి కళ్ల ముందు నాట్యం చేస్తే చూసేందుకు ఎంతో బాగుందనుకునే వాళ్లు కొందరైతే.. మరికొందరు సర్పాలు సయ్యాట చేసే దరిదాపుల్లోకి వెళ్లాలంటేనే భయపడతారు. అయితే చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం పెద్దతయ్యురులో పాముల సయ్యాట అందరినీ ఆకట్టుకుంది. గ్రామంలోని మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద సాయంత్రం 4 గంటల సమయంలో సర్పాల సయ్యాటను ఆసక్తిగా గమనించిన జనం సెల్ ఫోన్లలో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మినరల్ వాటర్ ప్లాంట్ వద్దకు తాగునీటిని తీసుకెళ్లేందుకు వచ్చిన స్థానికులు.. చుట్టూ ఎంతోమంది ఉన్నా అదేమీ పట్టనట్టు ఒకదాన్ని మరొకటి పెన వేసుకున్నాయి సర్పాలు.

దాదాపు రెండు గంటల పాటు రెండు పాములు సయ్యాట చేస్తూనే ఉండిపోయాయి. దీంతో అలా చూస్తూ ఉండిపోవడమే స్థానికుల పనైంది. తాగునీటి కోసం వచ్చిన వాళ్లంతా రోడ్డుపైనే పాములు పెనవేసుకుని సయ్యాట చేస్తుండటంతో ముందుకు వెళ్లలేకపోయారు. అటు.. ఇటు.. రోడ్డుపై వెళ్లే గ్రామస్తులు కూడా సర్పాల సయ్యాటను సెల్‌ఫోన్‌లలో ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తూ ఆసక్తిగా గమనించారు. దాదాపు 10 అడుగుల మేర ఉన్న రెండు సర్పాలను చూసి కొందరు భయంతో పరుగులు తీస్తే.. మరికొందరు మాత్రం సెల్ ఫోన్లలో చిత్రీకరించి
సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు ఆసక్తి చూపారు. తన్మయంతో జతకట్టి పెనవేసుకున్న రెండు సర్పాలు.. నాట్యం చేస్తూ రోడ్డుపై దర్శనమిచ్చి.. ఆ తర్వాత ముళ్లపొదల్లోకి వెళ్ళిపోయాయి. దాదాపు రెండు గంటలకు పైగా గ్రామస్తులందరినీ పాముల సయ్యాట కనువిందు చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *