Chiranjeevi-Jr NTR: చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో జూనియర్ ఎన్టీఆర్ సినిమా.. కట్ చేస్తే.. భారీ డిజాస్టర్.. ఏ మూవీనో తెలుసా?

Chiranjeevi-Jr NTR: చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో జూనియర్ ఎన్టీఆర్ సినిమా.. కట్ చేస్తే.. భారీ డిజాస్టర్.. ఏ మూవీనో తెలుసా?


భారతీయ సినిమా ఇండస్టరీలో మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రత్యేక స్థానముంది. కేవలం తన నటనతోనే కాకుండా డ్యాన్స్‌లతో సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసేశారు చిరంజీవి. 150 కు పైగా సినిమాలు చేసిన చిరంజీవి కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. రాజకీయాల కారణంగా మధ్యలో గ్యాప్ తీసుకున్నప్పటికీ ఖైదీ నంబర్ 150తో సెకెండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా షురూ చేశారు చిరంజీవి. ఆ తర్వాత సైరా, నరసింహా రెడ్డి, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో మళ్లీ రికార్డుల వేట మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేతిలో ఏకంగా నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర, అనిల్ రావిపూడితో మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. అలాగే వాల్తేరు వీరయ్య దర్శకుడు కే.ఎస్. రవీంద్ర, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలలతోనూ మెగాస్టార్ ప్రాజెక్టులు ఫిక్స్ అయ్యాయి. అయితే చాలా మంది హీరోల్లాగే చిరంజీవి కెరీర్ లో మధ్యలో ఆగిపోయిన సినిమాలు, రిజెక్ట్ చేసిన మూవీస్ చాలా నే ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మతో చెప్పాలని ఉంది, సింగీతం శ్రీనివాసరావుతో భూలోక వీరుడు, సురేష్ కృష్ణ దర్శకత్వంలో అబు తదితర సినిమాలు సెట్ పైకి వెళ్లకుండానే ఆగిపోయాయి. ఇదే క్రమంలో చిరంజీవి రిజెక్ట్ చేసిన కొన్ని కథలతో ఇతర హీరోలు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్లు కొట్టారు. మరికొందరు బోల్తా పడ్డారు. చిరంజీవి, ఎన్టీఆర్ ల విషయంలో కూడా ఒకసారి ఇలాగే జరిగింది. చిరంజీవి వద్దన్న సినిమాతో తారక్ ఓ సినిమా చేశాడు. రిలీజ్ కు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఆ మూవీ తీరా రిలీజయ్యాక భారీ డిజాస్టర్ గా నిలిచింది.

ఇంతకీ ఆ మూవీ ఏదనుకుంటున్నారా? పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలా. అప్పట్లో ఈ సినిమా క్రేజ్ మాములుగా లేదు. కేవలం మూవీ ఆడియో ఫంక్షన్ కే లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. అప్పుడే కాదు ఇప్పటికీ ఈ రికార్డు అలాగే ఉంది. ఇలా ఎన్నో అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఆంధ్రావాలా ఆడియెన్స్ ను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా కథను మొదట చిరంజీవికే చెప్పారట పూరి జగన్నాథ్. అయితే అప్పటికే మెగాస్టార్ చేతిలో పలు సినిమాలు ఉండడంతో పూరి సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదట. దీంతో డైరెక్టర్ ఎన్టీఆర్ కు కథ చెప్పి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించిన సంగతి తెలిసిందే. సినిమా హిట్ కాకపోయినా ఇందులోని పాటలు మాత్రం ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తుంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *