Chiranjeevi: చిరంజీవి తల్లి అంజనమ్మ ఇప్పుడెలా ఉన్నారో చూశారా? లేటెస్ట్ వీడియో వైరల్

Chiranjeevi: చిరంజీవి తల్లి అంజనమ్మ ఇప్పుడెలా ఉన్నారో చూశారా? లేటెస్ట్ వీడియో వైరల్


మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి అనారోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలయ్యారంటూ మంగళ వారం (జూన్ 24) ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అలాగే ఈ విషయం తెలుసుకున్న హీరో చిరంజీవి , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ పనులను మధ్యలోనే  వదిలి పెట్టి  హైదరాబాద్ కు పయనమయ్యారని రూమర్లు వినిపించాయి. ఈ వార్తలను చూసి మెగాభిమానులు కాస్త కంగారు పడ్డారు. అంజనమ్మ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించారు. అయితే నాగబాబు స్వయంగా తన తల్లి ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు. ‘అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది”. అమ్మ ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం బయటకు వచ్చింది. ఆరోగ్యపరంగా ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారు’ అంటూ నాగబాబు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈ పోస్ట్ తో మెగాభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అంజనమ్మ ఇప్పుడెలా ఉన్నారో తెలుసుకోవాలని చాలామంది మెగాభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఒక వీడియోలో కనిపించింది. వివరాల్లోకి వెళితే.. మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ ఇప్పుడు మరోసారి హీరోగా కనిపించనున్నాడు. అతను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ధన్య బాలకృష్ణ, మిషా నారంగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ‘ది 100’ చిత్రం జూలై 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం బిజి బిజీగా ఉంటోంది. ఈ క్రమంలోనే చిత్ర బృంం తాజాగా మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవిని కలుసుకుంది. కాగా  ‘మొగలిరేకులు’ సినిమా నుంచి ఆర్కే సాగర్‌కి అంజనాదేవి అభిమాని. ఈ విషయాన్ని ఆమెనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తన అంజనమ్మను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు ఆర్కే సాగర్. ఇదే సందర్భంగా మాట్లాడిన అంజనమ్మ ఆర్కే సాగర్ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ‘నాకు మొగలిరేకులు సీరియల్ నుంచి గుర్తిండిపోయాడు. మా నాన్న గారి పేరు కూడా ఆర్కే నాయుడు. అందుకే ఆ పేరుకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. చాలా నెమ్మదస్తుడు. ఇప్పుడు ఇతనిని కలుస్తుంటే మా నాన్నను కలిసినట్లు ఉంటుంది. అసలు ఆర్కే సాగర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లాలి.. నువ్వు అనవసరంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చావు’ అనిఅంజనమ్మ తెలిపారు.

ఇవి కూడా చదవండి

చిరంజీవి తల్లి మాటలకు ఉబ్బితబ్బిబ్బైన ఆర్కే సాగర్ నవ్వుతూ.. ‘పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి వస్తే మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చేది కాదు.. మిమ్మల్ని కలవడానికే ఇటు రావాల్సి వచ్చింది’ అని చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసి మెగాభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

మొగలి రేకులు హీరోతో అంజనా దేవి.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *