Child’s Drawing: చిన్నారి గీసిన డ్రాయింగ్‌పై పోలీసుల ఫోకస్.. దెబ్బకు వీడిన మర్డర్‌ మిస్టరీ!

Child’s Drawing: చిన్నారి గీసిన డ్రాయింగ్‌పై పోలీసుల ఫోకస్.. దెబ్బకు వీడిన మర్డర్‌ మిస్టరీ!


ఝాన్సీ, ఫిబ్రవరి 18: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఝాన్సీలోని కొత్వాలి పంచవతి శివ్ పరివార్ కాలనీలో సోనాలీ బుధోలియా (27) అనే ఓ వివాహిత ఇటీవల అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందింది. ఆత్మహత్య చేసుకొని మరణించిందని ఆమె అత్తమామలతోపాటు భర్త కూడా అందరికీ చెప్పారు. పోలీసులతో సహా అంతా నిజమనే అనుకున్నారు. కానీ మృతురాలి కుమార్తె దర్శిత గీసిన ఓ డ్రాయింగ్ అసలు గుట్టు విప్పింది. తల్లిని తన కళ్ల ఎదుటే కొట్టి, ఫ్యాన్‌కు ఉరి తీసి చంపింది మరెవరో కాదు తన తండ్రేనని మాటలు కూడా సరిగ్గారాని ఆ చిన్నారి ఎలా చెప్పాలో తెలియక.. తన నోట్‌ బుక్‌లో డ్రాయింగ్‌ వేసి చూపించింది. ‘నాన్నే అమ్మపై దాడి చేసి చంపేశాడు. ఆపై.. కావాలంటే నువ్వు చచ్చిపో అన్నాడు అని ఆ చిన్నారి మీడియాకు వివరించింది. అందుకు సంబంధించిన డ్రాయింగ్‌ను కూడా చూపించింది. గతంలో అనేకసార్లు తన తల్లిని చంపేస్తానంటూ కుమార్తె ఎదుట బెదిరించాడు కూడా. కానీ తల్లిని ఇంకోసారి ముట్టుకుంటే నీ చేయి విరిసేస్తానని దర్శిత ఓసారి తండ్రితో అనగా.. తండ్రి సందీప్‌ మాత్రం సోనాలీని చంపేస్తానని, మాట్లాడితే నన్ను కూడా చంపుతానని, కొట్టేవాడని చిన్నారి చెప్పింది. తల్లిని తలపై బండరాయితో కొట్టి, ఆపై ఉరి తీసి హతమర్చాడని చెప్పడంతో అంతా షాకయ్యారు. దీంతో ఈ కేసు ఆత్మహత్య కాదని, హత్యని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

సోనాలి బుధోలియాగా, ఆమె భర్త సందీప్ బుధోలియా భార్యభర్తలు. వీరికి 2019లో వివాహం జరిగింది. దర్శిత అనే నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం సందీప్‌ భార్యను నిత్యం వేధించేవాడు. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ జిల్లా నివాసి అయిన సోనాలి తండ్రి సంజీవ్ త్రిపాఠి మాట్లాడుతూ.. పెళ్లి నాడు కట్నంగా రూ.20 లక్షలు ఇచ్చానని, పెళ్లైన కొన్నాళ్ల తర్వాత మరింత కట్నం కావాలని అల్లుడు సందీప్‌ డిమాండ్‌ చేసినట్లు సోనాలి తండ్రి సంజీవ్‌ కన్నీరు మున్నీరుగా విలపించాడు. పైగా కారు కావాలని కూడా కోరాడు. కారు కొనడం నా శక్తికి మించినదని చెప్పినా వినలేదు. అప్పటి నుంచి నా కూతురిని కొట్టడం ప్రారంభించాడు. ఓ సారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. ఆ తర్వార రాజీకి రావడంతో పరిస్థితి సర్దుమనిగిందని అనుకున్నాను.

కానీ సోనాలీకి ఆడపిల్ల పుట్టిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. సందీప్‌కు మగపిల్లవాడు కావాలని కోరిక. డెలివరీ తర్వాత ఆస్పత్రి ఖర్చులు కూడా చెల్లించకుండా వెళ్లిపోయాడు. ఆ తర్వాత నెల రోజుల తర్వాత సోనాలీని భార్యగా స్వీకరించాడు. నాలి ఝాన్సీలోని సమతార్‌లో ఓ బంధువు ఇంటికి పెళ్లి వెళ్లగా సోనాలీ ఆరోగ్యం క్షీణించిందని సందీప్‌ ఫోన్‌ చేసి చెప్పాడు. కొద్ది సమయం తర్వాత ఫోన్‌ చేసి ఉరి వేసుకుందని చెప్పాడు. ఇంటికి వెళ్లి చూడగా నా కూతురు చనిపోయి కనిపించిందని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని కొత్వాలి నగర పోలీసు అధికారి రాంవీర్ సింగ్ మీడియాకు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *