Children Health: పిల్లలు ఊరికే జబ్బు పడుతున్నారా.. వారికి ఇవి నేర్పించండి..

Children Health: పిల్లలు ఊరికే జబ్బు పడుతున్నారా.. వారికి ఇవి నేర్పించండి..


మీ పిల్లలు తరచుగా జలుబు, దగ్గు, కడుపునొప్పితో బాధపడుతున్నారా? చిన్నపాటి అలసటకే అనారోగ్యం పాలవుతున్నారా? దానికి కారణాలు తెలియక ఆందోళన చెందుతున్నారా? ఈ సాధారణ కారణాలు తెలుసుకుని, సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా చేయవచ్చు.

1. సరైన పరిశుభ్రత లేకపోవడం:
పిల్లలు చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల చాలా రోగాలు వస్తాయి. ఆటలాడిన తర్వాత, బయట నుండి వచ్చినప్పుడు చేతుల్లో పేరుకుపోయే క్రిములు ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యానికి దారితీస్తాయి. పిల్లలు చేతులు శుభ్రంగా కడుక్కునేలా చూడటం చాలా ముఖ్యం.

2. తగినంత విశ్రాంతి లేకపోవడం:
పిల్లలు నిత్యం ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉంటారు. కానీ, వారికి తగినంత నిద్ర, విశ్రాంతి లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. త్వరగా అలసిపోయి జబ్బుపడే అవకాశం ఉంటుంది.

3. అతి శుభ్రత:
పిల్లలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని భావించి, మరీ ఎక్కువగా క్రిములను సంహరించే ఉత్పత్తులను వాడటం కూడా మంచిది కాదు. ఇది వారి రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు. బయట నుండి వచ్చినప్పుడు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

4. పోషకాహార లోపం:
పిల్లలకు సరైన, సమతుల్యమైన ఆహారం అందించడం చాలా ముఖ్యం. పోషకాహార లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, తరచుగా అనారోగ్యం బారిన పడతారు. ఆకుకూరలు, పండ్లు, పెరుగు వంటి పోషకాలున్న ఆహారాన్ని తరచూ ఇవ్వాలి.

5. శారీరక శ్రమ లేకపోవడం:
ఆటలు, శారీరక శ్రమ పిల్లలను చురుకుగా, ఫిట్‌గా ఉంచుతాయి. రోజుకు కనీసం కొంత సమయమైనా ఆడుకోకపోవడం వల్ల పిల్లలు ఫిట్‌నెస్‌ను కోల్పోయి, త్వరగా జబ్బుపడతారు.

6. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు జాగ్రత్తలు లేకపోవడం:
పిల్లలు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోకపోవడం వల్ల సూక్ష్మజీవులు వేగంగా ఇతరులకు వ్యాపిస్తాయి. ఇది వైరల్‌ ఇన్ఫెక్షన్లు, జ్వరాలకు దారితీస్తుంది. చేతులు లేదా కర్చీఫ్ అడ్డుపెట్టుకోవడం నేర్పించాలి.

7. అధిక చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్:
పిల్లలు స్వీట్స్, జంక్ ఫుడ్స్‌ను ఇష్టపడతారు. వీటిలో పోషకాలు తక్కువగా ఉండి, దంతక్షయం, ఊబకాయం వంటి సమస్యలకు కారణమవుతాయి. అధిక బరువు కూడా పిల్లలకు అనారోగ్యాన్ని తెస్తుంది.

8. ఒత్తిడి:
చదువులు, పరీక్షలు, మార్కులు వంటివి పిల్లలపై కూడా మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ ఒత్తిళ్లు వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

9. బలమైన మందుల వాడకం:
కొంతమంది తల్లిదండ్రులు చిన్నపాటి అనారోగ్యానికే పిల్లలకు బలమైన మందులను ఇస్తారు. ఇది పిల్లల రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. వీలైనంత వరకు వైద్యుల సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *