Car Safety Tips: ఇలా చేయండి.. వరదలొచ్చినా మీ కారు సేఫ్‌గా ఉంటుంది.. బెస్ట్ టిప్స్..

Car Safety Tips: ఇలా చేయండి.. వరదలొచ్చినా మీ కారు సేఫ్‌గా ఉంటుంది.. బెస్ట్ టిప్స్..


ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అనేక రకాల వాటితో అనుబంధం కలిగి ఉంటారు. తమ సొంతూరు, పెరిగిన ఇల్లు, చదువుకున్న పాఠశాల తదితర వాటితో ఆత్మీయ అనుబంధం పెంచుకుంటారు. అలాగే తాము ఉపయోగించుకునే వస్తువులను కూడా ఇష్టపడతారు. వాటిలో కార్లు అతి ముఖ్యమైనవి. ఉద్యోగంలో చేరిన తర్వాత తొలి సారిగా కొనుగోలు చేయడం, తల్లిదండ్రులు బహుమతిగా ఇవ్వడం తదితర కారణాలతో ప్రతి ఒక్కరూ తమ కార్లను కుటుంబంలో ఒకరిగా చూసుకుంటారు. అలాగే నగరంలో నివసించే వారందరూ తమ అవసరాలకు తగినట్టుగా కార్ల వినియోగిస్తున్నారు. వరదల సమయంలో కార్లు మునిగిపోయి పనికి రాకుండా పోతాయి. ఇలాంటి సమయంలో కారును రక్షించుకునే కొత్త విధానాన్ని ఒకరు కనిపెట్టారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం రెడ్డిట్ లో వచ్చిన ఈ పోస్టు వైరల్ గా మారింది.

దేశవ్యాప్తంగా అధిక వర్షాలు..

దేశ వ్యాప్తంగా ఇటీవల వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. నదులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. పట్టణాల్లో నీరు బయటకు పోయే మార్గం లేక పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. ముఖ్యంగా అపార్టుమెంట్ల సెల్లార్లలోకి నీరు వచ్చి చేరుతుంది. ఈ సమయంలో కార్లు ముంపు బారిన పడి పాడైపోతున్నాయి. ఈ సమస్య పరిష్కారినికి ఓ వ్యక్తి మంచి ఉపాయం కనిపెట్టాడు. తన కారును ప్లాస్టిక్ కవర్లతో చుట్టేశాడు. చుక్కనీరు కూడా లోపలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. వరదల సమయంలో కారును రక్షించుకోవడానికి ఇదే మంచి ఉపాయమంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన రెడ్డిట్ లో పోస్టు చేశాడు. ఈ పోస్ట్ చాలా మందిని ఆకర్షించింది. అతడు తన పోర్స్చే 911 కారును కవర్లతో ప్యాకింగ్ చేశాడు. అనేక మంది నెటిజన్లు దానిపై స్పందించారు.

రెడ్డిట్ అంటే..

రెడ్డిట్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫాం. దీనికి అనేక మంది యూజర్లు ఉన్నాయి. వివిధ అంశాలు, విచిత్ర వార్తలు, కొత్త విషయాలను దీనిలో పోస్టింగ్ చేస్తున్నారు. వరదల్లో కారును రక్షించుకునే విధానం కూడా దీనిలోనే వచ్చింది. ఈ పోస్టు పై నెటిజన్లు బాగా స్పందించారు. కొందరు శభాష్ అంటూ మెచ్చుకోగా, మరికొందరు వ్యంగ్యంగా చమత్కరించారు. చాలా మంది ఈ డిబేట్ లో పాల్గొన్నారు. సరైన విధానంలో కారును అలా సీల్ చేస్తే ప్రయోజనం ఉటుందంటూ ఒకరు మెచ్చుకున్నారు. మరొకరు మాత్రం ఆ కారు ఊపిరి ఆడక చనిపోతుంది అంటూ చమత్కరించాడు.

Can wrapping your car like this potentially save it from flood damage?
byu/CrazyMeerKat324 inCarsIndia

నీటితో చాలా నష్టం..

నిజానికి వరదల వల్ల కార్లకు విపరీతమైన నష్టం కలుగుతుంది. దేనికి పనికి రాకుండా పోతుంది. ఇంజిన్ లోకి నీరు ప్రవేశిస్తే దానిలోకి అంతర్గత భాగాలన్నీ పాడైపోతాయి. దాన్ని సరిచేయించుకోవడానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. గేర్ బాక్స్ లోకి నీరు చేరింతే మొత్తం నిరుపయోగంగా మారిపోతుంది. అలాగే కారులోని ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్ అంతా నాశనమవుతుంది. కాబట్టి వరదల సమయంలో కార్లను కాపాడుకోవడం చాలా అవసరం. అలాగే చాలా కష్టం కూడా.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *