Car Discount: ఈ అవకాశాన్ని వదులుకోకండి.. రూ.6 లక్షల లోపు ఉన్న కారుపై రూ.70 వేల తగ్గింపు!

Car Discount: ఈ అవకాశాన్ని వదులుకోకండి.. రూ.6 లక్షల లోపు ఉన్న కారుపై రూ.70 వేల తగ్గింపు!


మార్కెట్లో కార్లపై రకరకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజుల్లో సామాన్యుడు కూడా కారు కొనుగోలు చేస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు వివిధ కార్ల తయారీ కంపెనీలు కార్లపై బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. భారత మార్కెట్లో చాలా వాహన తయారీ కంపెనీలు ఉన్నాయి. మీరు కూడా మీ కోసం కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ జూలై 2025లో దాని వివిధ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది.

ఇది కూడా చదవండి: Bank Holidays: వచ్చే రెండు వారాల్లో 6 రోజులు బ్యాంకులు బంద్‌

ప్రస్తుతం కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌పై బంపర్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. కానీ ఈ ఆఫర్ జూలై 2025 వరకు మాత్రమే చెల్లుతుంది. మీరు ఈ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, మీరు సులభంగా 70 వేల రూపాయల వరకు ఆదా చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ డిస్కౌంట్ ఆఫర్లు:

డిస్కౌంట్ గురించి మరింత సమాచారం పొందడానికి మీరు మీ సమీపంలోని డీలర్‌షిప్‌ను కూడా సందర్శించవచ్చు. ఎందుకంటే డిస్కౌంట్ ఆఫర్ ప్రతిచోటా భిన్నంగా ఉంటుంది. అందుకే కారు కొనడానికి ముందు వెళ్లి ఎంత డిస్కౌంట్ అందిస్తున్నారో మీరే తెలుసుకోండి. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌లో ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏమిటి? దాని ధర ఎంత అనేది తెలుసుకుందాం.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫీచర్లు:

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ లక్షణాలు ఇది 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, యాంబియంట్ లైటింగ్ వంటి ఆధునిక లక్షణాలను కలిగి ఉంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, వెనుక పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. భారతదేశంలో ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.98 లక్షలు కాగా, దాని టాప్ వేరియంట్ రూ. 8.62 లక్షల వరకు ఉంటుంది.

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ఇంజిన్:

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌లో1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 83 బిహెచ్‌పి పవర్, 113.8 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు కంపెనీ ఈ కారులో కస్టమర్లకు సిఎన్‌జి వేరియంట్ ఆప్షన్‌ను కూడా ఇస్తుంది. ఇది మైలేజ్ పరంగా బాగుంటుందని కంపెనీ చెబుతోంది.

ఇది కూడా చదవండి: Air India Crash: విమానం అందుకే కూలిపోయింది.. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై సంచలన నివేదిక!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *