ఎల్జీ 242 ఎల్3 స్టార్ స్మార్ట్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్.. ఇది స్టైలిష్ గా ఉండటంతో పాటు మంచి పనితీరును అందిస్తుంది. స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీ తక్కువ కరెంట్ ఎక్కువ కూలింగ్ ను అందిస్తుంది. స్టైలిలైజర్ అవసరం లేకుండా పనిచేస్తుంది. మోయిస్ట్ ఎన్ ఫ్రెష్ లాటిస్ బాక్స్ కవర్ మాయిశ్చర్ లెవెల్స్ ను క్రియేట్ చేస్తుంది. ఈ ఫ్రిడ్జ్ పై 33శాతం డిస్కైంట్ అమెజాన్లో లభిస్తోంది. దీని ధర రూ. 24,999గా ఉంది.
శామ్సంగ్ 256ఎల్, 3స్టార్, కన్వర్టబుల్, డిజిటల్ ఇన్వర్టర్ విత్ డిస్ ప్లే డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ఈ ఫ్రిడ్జ్ పై 34శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇది కన్వర్టబుల్ మోడల్. దీనిని మనకు అవసరమైన విధంగా మోడ్స్ మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒక టచ్ సాయంతో ఇది సాధ్యమవుతుంది. ఆకస్మాత్తుగా కరెంట్ పోయినా 12 గంటల వరకూ రిఫ్రిజిరేటర్ లోని వస్తువులను తాజాగానే ఉంటాయి. స్టైబిలైజర్ అవసరం లేకుండా పనిచేస్తుంది. దీని ధర రూ. 29,490గా ఉంది.
వర్ల్పూల్ 235ఎల్ ఫ్రాస్ట్ ఫ్రీ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్.. అమెజాన్ సేల్లో దీనిపై సూపర్ డిస్కౌంట్ లభిస్తోంది. 32శాతం తగ్గిపుతో కేవలం రూ. 25,790కే కొనుగోలు చేయొచ్చు. 32 లీటర్ల స్టోరేజ్ కేవలం పండ్లు, కూరగాయల కోసం కేటాయించారు. మూడు ఇండిపెండెంట్ జోన్స్ ఇచ్చారు. పరిశ్రమల్లో ఉపయోగించే జియోలైట్ టెక్నాలజీ, మోయిశ్చర్ రిటెన్షన్ టెక్నాలజీని ఇందులో వాడారు. 99శాతం బ్యాక్టీరియాను అస్సలు లోపల ఎదగనివ్వదు. దీంతో ఆహార పదార్థాలు తాజాగా ఉంటాయి. ఎనర్జీ ఎఫీషియంట్ గా పనిచేస్తుంది.
ఐఎఫ్బీ 265ఎల్ 2 స్టార్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్.. ఇది మల్టీ పర్పస్ రిఫ్రిజిరేటర్. దీనిలో 7 ఇన్ 1 మల్టీ మోడ్ ఫక్షన్స్ ఉంటాయి. మీ స్టోరేజ్ అవసరాలకు అనుగుణంగా మోడ్స్ మార్చుకునే వీలుంటుంది. 4 నుంచి ఐదుగురు ఉండే కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది. 64లీటర్ల ఫ్రీజర్ కెపాసిటీ, 201ఎల్ ఫ్రెష్ ఫుడ్ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. 360 డిగ్రీల కూలింగ్ టెక్నాలజీతో లోపలి ప్రతి మూలన ఒకే రకమైన టెంపరేచర్ ఉండేలాచేస్తుంది. దీనిపై అమెజాన్ సేల్లో 37శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని సాయంతో ఈ ఫ్రిడ్జ్ ను రూ. 25,990కే కొనుగోలు చేయొచ్చు.
హయర్ 237ఎల్, 2 స్టార్ 8 ఇన్ 1 కన్వర్టబుల్, ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ బాటమ్ మౌంట్ రిఫ్రిజిరేటర్.. అమెజాన్ సేల్లో దీనిపై 32శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇది అతి తక్కువ కరెంట్ తో మంచి కూలింగ్ ను అందిస్తుంది. దీనిలో జుక్నా మ్యాట్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. దీని సాయంతో లోపలి వస్తువులు తాజాగా ఉంటాయి. ఇది 49 నిమిషాల్లోనే ఐస్ ను తయారు చేస్తుంది. ఇతర బ్రాండ్ రిఫ్రిజిరేటర్లతో పోల్చితే దాదాపు 200శాతం వేగంగా ఇది ఐస్ ని తయారు చేస్తుంది. స్టెబిలైజర్ లేకుండా పనిచేస్తుంది. దీని ధర రూ. 25,990గా ఉంది.