Headlines

Benefits of Amla: ఉసిరి- ఆరోగ్య సిరి..! చలికాలంలో రోజుకు ఒకటి తింటే చాలు.. ఈ లాభాలన్నీ సొంతం..!

Benefits of Amla: ఉసిరి- ఆరోగ్య సిరి..! చలికాలంలో రోజుకు ఒకటి తింటే చాలు.. ఈ లాభాలన్నీ సొంతం..!


ఉసిరి చేసే మేలు అంత ఇంతా కాదు..శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లు ఉసిరిలో పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. శీతాకాలంలో ప్రజల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే చలికాలంలో రోజూ ఉసిరికాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది కాకుండా ఉసిరి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచడంలో ఉసిరికి మించింది లేదు.

గుండె సమస్యలకు పరిష్కారం కూడా ఈ ఉసిరిలో దాగి ఉంది.  ఉసిరికాయను తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.. మీ గుండె హెల్తీగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  అంతేకాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉసిరికాయ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది చక్కెరను అదుపులో ఉంచుతుంది.

ఉసిరికాయ జీర్ణశక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉసిరికాయను క్రమం తప్పకుండా తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఉసిరిలో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ మిశ్ర‌మాలుంటాయి. మహిళల్లో ఎదురయ్యే నెల‌స‌రి స‌మ‌స్య‌లు త‌గ్గించ‌డం, ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ స‌క్ర‌మంగా ప‌నిచేయ‌డంలో ఉసిరి సాయ‌ప‌డుతుంది. రోజూ ఒక ఉసిరి కాయ తింటే క‌ఫం స‌మ‌స్య‌లు త‌గ్గుతాయని, ప‌రగ‌డుపున ఒక స్పూను ఉసిరి పొడిని నీళ్ల‌లో క‌లుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయ‌ని వైద్యులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *