Banana Flower: అరటి పువ్వు ఆరోగ్య రహస్యం తెలిస్తే అస్సలొదిలిపెట్టరు..? ఏడాదికి ఒక్కసారైనా తినాల్సిందే..

Banana Flower: అరటి పువ్వు ఆరోగ్య రహస్యం తెలిస్తే అస్సలొదిలిపెట్టరు..? ఏడాదికి ఒక్కసారైనా తినాల్సిందే..


అరటి పువ్వు తెలియని వారుండరు. దీనితో తయారుచేసిన వంటకాలు భలే రుచిగా ఉంటాయి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ అరటి పువ్వును శాస్త్రీయంగా ముసా అక్యుమినాటా అని పిలుస్తారు . దీనిని ఆయుర్వేద ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. అందుకే చాలా మంది క్రమం తప్పకుండా కూరగాయగా ఉపయోగిస్తారు. అంతే కాదు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీనిని ఏడాదికి కనీసం ఒకసారైనా తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే దీనికి రకరకాల వ్యాధులను నివారించే శక్తి ఉంటుంది. దీనిని ఆహారంలో వినియోగించడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

అరటి పువ్వు ఉపయోగాలు

  • అరటి పువ్వు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అరటి పువ్వులలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
  • అరటి పువ్వులలో ఉండే విటమిన్లు ఎ, సి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అవి కాలానుగుణ వ్యాధులను నివారిస్తాయి.
  • అరటి పువ్వులలో ఉండే మెగ్నీషియం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళన, నిరాశ భావాలను నివారిస్తుంది.
  • అరటి పువ్వులలో ఉండే విటమిన్ బి6 మహిళల్లో రుతుక్రమ సమస్యలను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  • అరటి పువ్వు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
  • అరటి పువ్వులలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అవి నొప్పి, వాపు, ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గిస్తాయి.
  • పాలిచ్చే తల్లులు అరటి పువ్వులు తినడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. శిశువు ఆరోగ్యంగా ఉంటుంది.
  • అరటి పువ్వులలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అవి నొప్పి, వాపు, ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గిస్తాయి.
  • దీనిలోని ఫైబర్ కంటెంట్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
  • అరటి పువ్వు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే, మధుమేహం ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవాలి.
  • అరటి పువ్వులలోని పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.
  • అరటి పువ్వు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని, వృద్ధాప్యాన్ని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
  • 50 ఏళ్లు పైబడిన పురుషులు మూత్రం సరిగా లేకపోవడం, మూత్రం లీకేజ్ వంటి సమస్యలను అనుభవిస్తుంటారు. ఈ పువ్వును ఆహారంలో ఉపయోగించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

అరటి పువ్వులను ఉడికించి లేదా వేయించి సలాడ్లు, సూప్‌లు వంటి వివిధ వంటలలో ఉపయోగించవచ్చు. వాటిని కూరలు, సలాడ్‌లలో కూడా ఉపయోగిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో అరటి పువ్వులతో టీ కూడా తయారు చేసి తాగుతారు. కానీ గుర్తుంచుకోండి.. దానిని ఉపయోగించే ముందు రేకుల మధ్య వచ్చే రసాన్ని శుభ్రం చేయాలి. లేకుంటే వంటలు చేదుగా ఉంటాయి. అరటి పువ్వులను నిమ్మకాయ నీటిలో నానబెట్టడం వల్ల చేదు తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *