Ayush Mhatre : ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా అండర్-19 కెప్టెన్ ఆయుష్ మాత్రే తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో జట్టులోని 10 మంది ఆటగాళ్లు కలిసి అతడికి ఓ స్పెషల్ బహుమతి ఇచ్చారు. అయితే, ఆ బహుమతిని సాధించడంలో ఆయుష్ పాత్ర కూడా ఉంది. 16 జూలై 2007న జన్మించిన ఆయుష్ మాత్రే తన 18వ పుట్టినరోజు సందర్భంగా ఈ గిఫ్ట్ అందుకున్నారు. భారత అండర్-19 జట్టు ఓపెనర్, కెప్టెన్ ఆయుష్ మాత్రేకు ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం అనేది ఒక బర్త్ డే కానుకగా లభించింది. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఈ కానుకకు మరింత విలువ ఉండేది. ఈ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్ సింగ్ ఛవ్డా, అభిజ్ఞాన్ కుండూ, రాహుల్ కుమార్, ఆర్ఎస్ అంబ్రీష్, మహమ్మద్ ఎనాన్, హెనిల్ పటేల్, అన్మోల్‌జీత్ సింగ్, దీపేష్ దేవేంద్రన్ తమ అద్భుతమైన ఆటతీరుతో ఆయుష్‌కు ఈ బహుమతిని ఇచ్చారు.
బెక్స్‌నమ్‌లో జరిగిన ఈ నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో, భారత అండర్-19 జట్టు ఇంగ్లాండ్‌కు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దానికి సమాధానంగా ఇంగ్లాండ్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 270 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంటే, ఇంగ్లాండ్ తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. అలాగే భారత బౌలర్లు మిగిలిన మూడు వికెట్లు తీయలేకపోయారు. దీనితో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత అండర్-19 కెప్టెన్ ఆయుష్ మాత్రే బ్యాటింగ్‌లో కూడా అదరగొట్టారు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 134 పరుగులు చేసి భారత బ్యాటర్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు. అందులో మొదటి ఇన్నింగ్స్‌లో సాధించిన సెంచరీ కూడా ఉంది. ఈ ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..