
Hyderabad: అరెరె.. పేద, మధ్యతరగతి వర్గాలకు మరో దెబ్బ.. పైకి ఎగబాకిన టమోటా ధర
టమోటా ధరలు మరోసారి పైచూపు చూస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో టమోటా ధర విపరీతంగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల క్రితం కిలో రూ.20 నుంచి 30 వరకు ఉండగా.. ఇప్పుడు హోల్‌సేల్ మార్కెట్‌లో రూ.60 నుంచి 70కి అమ్ముడవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లడంతో సప్లై తగ్గి ఈ ఆకస్మిక ధర పెరుగుదలకు కారణమైనట్లు తెలుస్తోంది. మార్కెట్‌కు వచ్చే టమోటాల పరిమాణం సాధారణ ఇన్‌ఫ్లోలో సగం కంటే…