
Tamil Nadu: చిన్న స్టాలిన్‌కు పెద్ద ఎలివేషన్.. డిప్యూటీ సీఎంగా ఉదయనిధికి ప్రమోషన్
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా స్టోరీ. తండ్రీ కొడుకు ఓ తమిళనాడు…పొలిటికల్ స్టోరీ ఇది. సినిమాను మించిన మాస్ మసాలా సీన్లు, ట్విస్టులతో పొలిటికల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు, తమిళ రాజకీయ వెండి తెరపై మంటలు పుట్టించే రియల్ పొలిటికల్ మూవీ స్టార్టయింది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. సినిమా సూపర్ స్టార్‌ను సినిమా స్టార్ కమ్ పొలిటీషయన్‌తోనే ఎదుర్కోవాలి. ఇదే అస్త్రం, ఇదే వ్యూహంతో అధికార డీఎంకే పొలిటికల్ మూవీ స్టార్టయింది. ఉదయనిధితో విజయ్‌కు…