
Women’s T20 World Cup 2024: రేపటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్.. టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదిగో
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్ గురువారం (అక్టోబర్ 3) నుంచి ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా జరగనున్న ఈ టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. తొలి రౌండ్‌లో గ్రూపుల్లోని జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్-ఎలో ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు, గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ ధనాధన్ టోర్నమెంట్…