మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): శుభ గ్రహాల అనుకూలత వల్ల ఈ నెలంతా సానుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. కుటుంబం మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా మీ మాటకు విలువ ఉంటుంది. మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలు చదువుల్లో మంచి ఫలితాలు గడిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వస్త్రాభరణాలు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. విహార యాత్రకు అవకాశం ఉంది. ఈ రాశివారు ఈ నెలంతా సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు ఆగస్టు 20 వరకూ ధన స్థానంలో గురువుతో కలిసి ఉన్నందువల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. లాభ స్థానంలో శనీశ్వరుడు కొనసాగుతున్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. మొత్తం మీద ఈ రాశివారికి ఈ నెలంతా చాలావరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి లాభాలు వృద్ధి చెందుతాయి. రాహుకేతువులకు పరిహారంగా ఈ రాశివారు స్కంద స్తోత్రం పఠించడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆగస్టు చివరి వరకూ రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో ఉండడంతో పాటు, మిథున రాశిలో గురు, శుక్రులు యుతి చెందడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు కూడా విశేషంగా లాభిస్తాయి. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో బంధుమిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. పలుకుబడి బాగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. విద్యార్థులు ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో మాట ఇవ్వడం మంచిది కాదు. తరచూ విష్ణు సహస్ర నామ స్తోత్ర పఠనం వల్ల సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): శుభ గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల ఈ రాశివారికి ఈ నెలంతా సామాన్యంగా గడుస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు సాహసాలు చేయకపోవడం మంచిది. ప్రతి పనిలోనూ శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశా భంగాలు ఎదురవుతాయి. ఆదాయానికి లోటుండదు కానీ, ఖర్చులు వృద్ధి చెందుతాయి. ముఖ్య మైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. తలపెట్టిన ప్రతి పని నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల సహకారంతో బాధ్యతలను పూర్తి చేస్తారు. పిల్లలు చదువుల్లో కొద్దిగా పురోగతి సాధిస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ రాశి వారు బుధుడికి పరిహారంగా దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశివారికి ఆగస్టు నెలంతా లాభస్థానంలో గురు, శుక్రులు, ధన స్థానంలో కుజుడి సంచారం వల్ల ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా అనుకూలంగానే ఉన్నప్పటికీ, ఇతరులకు సహాయం చేయడం వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది. వ్యాపారపరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవాలి. పిల్లల చదువులు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. అష్టమ శని, సప్తమ రాహువుకు పరిహారంగా తరచూ శివార్చన చేయించడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు లాభ స్థానంలోనూ, గురు, శుక్రులు దశమ స్థానంలోనూ ఉన్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు, మరి కొన్ని శుభ పరిణామాలకు అవకాశం ఉంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు కూడా తీసుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు లాభదాయకంగా సాగిపోతాయి. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. గతంలో మీ నుంచి ఆర్థిక సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ముఖ్య మైన వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దీర్ఘకాలిక రుణాల విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. సప్తమంలో ఉన్న శనికి, కన్యారాశిలోనే ఉన్నకుజుడికి పరిహారంగా స్కంద స్తోత్రం పఠించడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ నెలంతా భాగ్య స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు గురువుతో కలిసి ఉండడం, దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికారయోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అదృష్టాలు కలిసి వస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. కుటుంబంలో పెళ్లి, గృహప్రవేశం తదితర శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. పెండింగ్ పనులు, వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. ఆదాయం సంతృప్తి కరంగా ఉంటుంది. అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం పొందుతారు. జీవిత భాగ స్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో అధిక లాభాలు పొందుతారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. వ్యయ స్థానంలో ఉన్న కుజుడికి పరిహారంగా సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు లాభ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండదు. చతుర్థంలో రాహు సంచారం కారణంగా మధ్య మధ్య అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. గృహ, వాహన ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. కొద్ది శ్రమతో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంలో, సునాయాసంగా పూర్తవుతాయి. ఇంటా బయటా చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువ రాబడి ఉంటుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభ కార్యం జరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. రాహుకేతువులకు పరిహారంగా స్కంద స్తోత్రం పఠించడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో శుక్రుడితో కలిసి ఉండడం, దశమ స్థానంలో కుజుడి సంచారం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో రవి భాగ్యస్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. అర్ధాష్టమ శని వల్ల ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. అధికారుల ఆదరాభిమానాలు లభిస్తాయి. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అర్ధాష్టమ శనికి పరిహారంగా శివార్చన చేయించాల్సి ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో సంచారం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఏదో ఒక విధంగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా పురోగతి ఉంటుంది. అధికారులు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు. సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్ప డడం వల్ల ఇంటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలం ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత అప్రమ త్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రయాణాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి. అనుకోకుండా మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఈ రాశివారు దుర్గాదేవి స్తోత్రం పఠించడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): రాశ్యధిపతి శని ధన స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యంగానైనా ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సొంత ఇంటి ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం రాజీ మార్గంలో పరిష్కారం అవుతుంది. పంచమ స్థానంలో గురు, శుక్రుల సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. బంధువులతో మాట పట్టింపులు వచ్చే సూచనలున్నాయి. నిరుద్యోగులు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆర్థిక విషయాల్లో ఇతరులకు మాట ఇవ్వకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. తరచూ శివార్చన చేయించడం వల్ల ఏలిన్నాటి శని ప్రభావం తగ్గుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశికి చతుర్థంలో రాశ్యధిపతి గురువు శుక్రుడితో కలిసి ఉండడం, పంచమంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల నెలంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. సొంత ఇంటి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం మెరుగు పడుతుంది. వృత్తి, వ్యాపారాలే కాకుండా ఉద్యోగాలు కూడా ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పిల్లల చదువులకు సంబంధించి సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఈ రాశివారు దత్తాత్రేయ స్వామిని ప్రార్థించడం వల్ల బాగా లబ్ధి పొందుతారు.