
బంగారం కోల్పోవడం ఒక వ్యక్తి జాతకంలో కేతువు, శని, రాహువు అనే మూడు గ్రహాల చెడు ప్రభావం వల్ల జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ మూడు గ్రహాలు కష్టాలను, ఆర్థిక నష్టాలను, ఆరోగ్య సమస్యలను తెస్తాయని నమ్మకం. అందు వల్ల బంగారం పోగొట్టుకోవడం అంటే ఆ వ్యక్తి దురదృష్టంలో పడినట్లు భావిస్తారు. ఇది కేవలం బంగారం మాత్రమే కాదు.. ఇతర విలువైన వస్తువులను కోల్పోవడానికి కూడా ఇదే సంకేతం కావచ్చు. దీంతో వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, విపత్తులు కూడా ఎదురవుతాయి.
చాలా మంది బంగారం దొరికితే అదృష్టంగా భావిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రయాణ సమయంలో లేదా దారిలో బంగారం కనిపించడం మంచిది కాదు. ఇది సూర్యుడు, బృహస్పతి గ్రహాల చెడు స్థితిని సూచిస్తుంది. సూర్యుడు గ్రహాలకు రాజు అయినప్పటికీ.. ఈ రెండు గ్రహాల చెడు ప్రభావం దురదృష్టాన్ని తెస్తుంది. బంగారం రోడ్డు మీద కనిపించడం వల్ల వ్యక్తి కీర్తి, ఆత్మవిశ్వాసం కోల్పోతారని.. సమాజంలో హోదా తగ్గిపోతుందని భావిస్తారు. ఇది వ్యక్తి ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. అందువల్ల బంగారం దొరికినా అది ఆ వ్యక్తికి మంచిది కాకపోవచ్చు.
రోడ్డు మీద బంగారం కనిపిస్తే దాన్ని సొంతం చేసుకోవడం మంచిది కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజు ఆ బంగారాన్ని బ్రాహ్మణులకు ఇవ్వడం ఉత్తమం. దీని వల్ల కేతువు, శని, రాహువు గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నమ్మకం. ఈ విధంగా మీరు దురదృష్టాన్ని తగ్గించుకొని శాంతియుత జీవితం గడపవచ్చు.
బంగారం పోగొట్టుకున్నవారు లేదా దొరికిన బంగారాన్ని ఉంచుకున్నవారు కీర్తి, సంపద, ఆరోగ్యం కోల్పోవడం వంటి సమస్యలకు గురవుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందువల్ల ఈ సందర్భాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం.
భారతీయ సంప్రదాయంలో బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అదృష్టానికి చిహ్నం, శుభకార్యాలకు ముఖ్యమైన భాగం. బంగారం ధరించడం లక్ష్మీదేవికి ప్రీతికరంగా భావిస్తారు. అందుకే వివాహాల్లో, పుట్టినరోజుల్లో, ఇతర శుభకార్యాల్లో బంగారం ఎక్కువగా ధరించడం సంప్రదాయం. ఇది మన సంపద, ఆర్థిక స్థితిని కూడా సూచిస్తుంది.
బంగారం పోగొట్టుకోవడం లేదా దొరికినప్పుడు జరిగే పరిణామాలు జాతక గ్రహాల అమరికపై ఆధారపడి ఉంటాయి. కేతువు, రాహువు, శని గ్రహాలు చెడు స్థానంలో ఉన్నప్పుడు ఈ రకమైన సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. బంగారం పోగొట్టుకోవడం అంటే ఈ మూడు గ్రహాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు అర్థం.
అలాగే రోడ్డు మీద బంగారం దొరికితే బృహస్పతి, సూర్య గ్రహాల చెడు ప్రభావం ఉందని భావిస్తారు. ఈ రెండింటి చెడు స్థితి వ్యక్తి జీవితంలో అనిశ్చితులు, ప్రమాదాలు, ఆత్మవిశ్వాసం కోల్పోవడం వంటి సమస్యలకు దారి తీస్తుంది.
జ్యోతిష్యం ప్రకారం గురువారం రోజు బ్రాహ్మణులకు బంగారాన్ని ఇవ్వడం వల్ల ఈ ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. అదనంగా ఆహారంలో, ఆచారాలలో సరైన మార్పులు చేసి మంచి కర్మ చేయడం కూడా అవసరం. బంగారం పోగొట్టుకున్నా లేదా దొరికినా.. దాన్ని సంపాదించే లేదా వదిలించుకునే పద్ధతులు శుభకార్యాల విధానాలకు అనుగుణంగా ఉండాలి.
బంగారం మన సంపద, గౌరవం, శ్రేయస్సుకు ప్రతీకగా ఉండే వస్తువు. కానీ దాన్ని పోగొట్టుకోవడం లేదా దొరికిన సందర్భాలలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. జ్యోతిష్య సూచనల మేరకు బంగారం పోగొట్టుకున్నా దొరికినా దానిని వదిలించుకోవడం మంచిది. ఇలా చేసేవారు ప్రతికూల పరిస్థితులను అధిగమించి సుఖంగా జీవించవచ్చు.