Arjun Tendulkar: నిశ్చితార్థం చేసుకున్న సచిన్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్.. అసలు ఎవరు ఈ సానియా చందోక్‌!

Arjun Tendulkar: నిశ్చితార్థం చేసుకున్న సచిన్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్.. అసలు ఎవరు ఈ సానియా చందోక్‌!


లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. అర్జున్ బుధవారం (ఆగస్టు 13) ముంబైకు చెందిన బడా వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అర్జున్, సానియా ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. రెండు కుటుంబాల సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో అర్జున్, సానియా చందోక్‌ ఉంగరాలు మార్చుకున్నారు. అయితే ఈ వేడుక గురించి టెండూల్కర్ కుటుంబం మాత్రం ఇప్పటివరకు సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

అసలు ఎవరు ఈ సానియా చందోక్‌..?

సానియా ఘాయ్ కుటుంబానికి చెందిన యువతి. ఈమె ఎక్కువగా లో ప్రొఫైల్‌ మేంటేన్‌ చేసేందుకు ఇష్టపడుతుండడంతో చాలా మందికి ఆమె గురించి తెలిదు. ఈమె ముంబైలోని అత్యంత ప్రముఖ వ్యాపార కుటుంబం అయిన ఘాయ్‌ ఫ్యామిలీ నుంచి వచ్చింది.  ఘాయ్ కుటుంబం ముంబైలో చాలా పేరున్న వ్యాపార కుటుంబం. వీరికి ఇంటర్ కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్ హోటల్ తో పాటూ  బ్రూక్లిన్ క్రీమరీ  ఐస్ క్రీమ్(తక్కువ కేలరీల ఐస్ క్రీం బ్రాండ్) వ్యాపారం కూడా ఉంది.

గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు 17 ఫస్ట్ క్లాస్, 18 లిస్ట్-ఎ మరియు 24 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో, అర్జున్ 33.51 సగటుతో 37 వికెట్లు పడగొట్టాడు. అతను 23.13 సగటుతో 532 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో, అర్జున్ 25 వికెట్లు (సగటున 31.2) మరియు 102 పరుగులు (సగటున 17) సాధించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *