
కర్నూలు జిల్లా ఆదోని మండలం నారాయణపురం గ్రామంలో సోమవారం అబ్బురపరిచేలా ఇలా ఐక్యతతో సహపంక్తి భోజనం చేశారు.
తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. గ్రామంలోని గర్జప్ప స్వామి దేవాలయంలో కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసం తరువాత వచ్చే అమావాస్య మరుసటి రోజున స్వామి సన్నిధిలో ఊరంత ఇంట్లో చేసుకున్న భోజనాన్ని ఉమ్మడిగా రాశిగా పోస్తారు. పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం ఆవరణలో ఊరంతా కుల మతం బేధం లేకుండా కలిసి భోజనం చేస్తారు. ఈ సంప్రదాయం తాత ముత్తాతల కాలం లో గ్రామానికి కరువు రావడంతో అప్పటి పెద్దలు ఐక్యమత్యంతో దేవాలయం దగ్గర పూజలు చేసి అందరూ ఐక్యంగా సహపంక్తి భోజనం చేశారు. అప్పటి నుండి ఈనాటి వరకు కార్తీక మాసం అమావాస్య పూర్తయిన మొదటి సోమవారం రోజు ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ ఇప్పటికి గ్రామంలోని అందరూ కలిసి భోజనాన్ని ఆరగిస్తూ వస్తున్నారు. స్వామివారికి భోజనం నివేదించి, అన్న ప్రసాదాన్ని కలిసి తింటే మేలు జరుగుతుందని ఆ ఊరి జనం విశ్వసిస్తారు.
ఇది చదవండి:
మీ ఐ ఫోకస్ ఏ రేంజిదేంటి.? ఈ ఫోటోలోని ముగ్గురు అమ్మాయిలను కనిపెట్టగలరా
ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటని చూడగా
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.