వయసు పెరిగేకొద్దీ చర్మంపై ముడతలు రావడం సర్వసాధారణం. దీంతో చర్మం తన మెరుపును కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి ఇరవై ఏళ్ల వయసులోనూ వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు చింతించకండి. మీ వయస్సును అదుపులో ఉంచే కొన్ని మ్యాజిక్ డ్రింక్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
గ్రీన్ టీ – గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ రాత్రి భోజనం తర్వాత ఒక కప్పు గ్రీన్ టీ తాగడం మంచిది.
బీట్రూట్ రసం – ఉదయం ఖాళీ కడుపుతో బీట్రూట్ రసం త్రాగాలి. మీరు అందులో ఆమ్లా జ్యూస్ కూడా కలపవచ్చు. ఇలా చేస్తే రోజంతా తాజాగా ఉంటారు.
వేడి పాలలో పసుపు కలిపి.. పడుకునే ముందు తాగాలి. ఇలా పసుపు పాలు తాగడం వల్ల రాత్రిళ్లు బాగా నిద్రపడుతుంది. చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది.
టమోటా రసం – వారానికి ఒకసారి టమోటా రసం తాగాలి. టమోటాలలో చర్మాన్ని తాజాగా ఉంచే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. టమోటా రసం తాగడం వల్ల మీ చర్మం కూడా మెరుస్తుంది.