ఇరుగు దిష్టి …పొరుగు దిష్టి , ఊర్లోవాళ్ళ దృష్టి , నాదిష్ఠి … తూ తూ.. ఇలాంటి పదాలు మనం వింటాము. సాధారణంగా చిన్నపిల్లలకు దిష్టి తీసేప్పుడు ఇలాంటి పదాలు వాడుతుంటారు. ఇక ఒంటికి లేదంటే మన భవనాలకు నరదృష్టి సోకకూడదని గుమ్మడికాయలు కట్టడం, రాక్షసుడి బొమ్మ , వినాయకుడి బొమ్మలు సైతం పెడుతుంటారు. ఎందుకంటే నరదృష్టి సోకితే రాళ్లు సైతం కరిగిపోతాయనే నానుడిని పదే పదే మన పెద్దలు కూడా చెబుతుంటారు. వినాయకుడికి విజ్ఞాధిపత్యం ఇచ్చిన రోజు ఆయన బాగా తిని నడవలేక ఆయాస పడుతున్న సమయంలో చంద్రుడు చూడటం – గణపయ్య పొట్టపగిలి ఆయన కడుపులోని ఆహార పదార్ధాలు అన్ని బయటకు రావటంతో పార్వతీ దేవి చంద్రుడికి శాపం పెట్టిందని కూడా మనం వినాయక వ్రతకల్పంలో చూసాము. కానీ, పభుత్వ కార్యాలయాలకు సైతం ఈ దృష్టి తగులుతుందా..?
ఈ ప్రశ్నకు ఇపుడు ఎస్ అనే అనాల్సివస్తుంది..? ఎందుకంటే.. ఏలూరు ఏజెన్సీ కుక్కునూరులోని ఫారెస్ట్ ఆఫీస్ ను ఆధునీకరించే పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గేటుకి దృష్టి తగలకుండా బ్యానర్స్ కట్టారు. అందులో ఒకవైపు రాక్షసుడు , మరోవైపు కళ్ళ దృష్టి వినాయకుడి బొమ్మలు కనిపిస్తున్నాయి.
ఇలా ప్రభుత్వ కార్యాలయానికి ఇలాంటి దిష్టి తొలగించే బొమ్మలు అంటించటం పట్ల, స్థానికులతో పాటు, అటుగా వెళ్లే వారంతా దీనిపై చర్చించుకుంటున్నారు. ఎవరినమ్మకాలు వారికి ఉంటాయి. కానీ, గవర్నమెంట్ ఆఫీసులకు కూడా ఇలాంటివి కట్టడం మూఢనమ్మకాలను ప్రోత్సహించటమేనంటూ మరికొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఎవరి నమ్మకం వారిది .. కొట్టిపడేయలేము అంటూ ఇంకొందరు వాధిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..