Andhra News: ప్రియుడితో ఆ యవ్వారం.. భర్తను అడ్డుతొలగించుకునేందుకు భార్య మాస్టర్‌ ప్లాన్..

Andhra News: ప్రియుడితో ఆ యవ్వారం.. భర్తను అడ్డుతొలగించుకునేందుకు భార్య మాస్టర్‌ ప్లాన్..


విశాఖ జిల్లా భీమిలి మండలం నగరపాలెం అనే ప్రాంతంలో వెంకట జ్యోతిర్మయి అనే మహిళ జీవితం సాధారణంగా సాగుతుంది. ఆమెకు రమేష్ అనే భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ కుటుంబం ఆనందపురం మండలం బొడ్డుపాలెం గ్రామంలో నివసిస్తున్నారు. రమేష్ సీ-మెన్ ఉద్యోగం కోసం శిక్షణకు చెన్నై వెళ్లాడు. ఆ సమయంలో జ్యోతిర్మయికి  ప్రక్క గ్రామానికి చెందిన రాగాతి రాము అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా అక్రమ సంబంధంగా మారింది. ఈ క్రమంలోనే రమేష్ శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు. భార్య ప్రవర్తనలో మార్పును గమనించి ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. దీంతో ఇరువురి మధ్య గొడవలు పెరిగాయి. జ్యోతిర్మయి తన ప్రియుడు రాముతో కలిసి, భర్తను అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంది. వారిద్దరు కలిసి చొక్కా నరేష్, పాడ రాజు అలియాస్ ముక్కు అనే మరో ఇద్దరిని సహాయం చేయాలని కోరారు. 2015 జూలై 26న రమేష్ మరోసారి భార్యను నిలదీశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జ్యోతిర్మయి రాముకు ఫోన్ చేసింది. వెంటనే రాము, తన ఇద్దరు స్నేహితులతో వచ్చి జ్యోతిర్మయి ఇచ్చిన తలుపు చెక్కతో రమేష్ తల పై బలంగా కొట్టాడు. తీవ్ర గాయంతో రమేష్ అక్కడికక్కడే మరణించాడు.

ఆ ఘటనను జ్యోతిర్మయి రెండవ కుమార్తె అయిన ఆరేళ్ల సౌమ్య చూసింది. విషయం బయటపడుతుందని భయపడిన నిందితులు రమేష్ మృతదేహాన్ని అర్ధరాత్రి భీమిలి బీచ్‌కు తీసుకెళ్లి, పెట్రోల్ పోసి కాల్చేశారు. తిరిగి ఇంటికి వచ్చాక, సౌమ్యను కూడా చంపాలని నిర్ణయించారు. ఆమెను విజయనగరం పూల్ బాగ్ ప్రాంతంలోని నిర్మానుష్య బావిలో పడేసి, చంపేశారు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే ఈ కేసుపై దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులకు సంచలన విషాయాలు తెలిశాయి. భర్త హత్యకు భార్య జ్యోతిర్మయితో పాటు ప్రియుడు రాము కారణమని నిర్ధారించి వారిని అరెస్టు చేశారు. అయితే కేసు కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే యాక్సిడెంట్ లో ప్రధాన నిందితుడు రాగాతి రాము మరణించాడు. మిగిలిన ముగ్గురి పై విజయనగరం ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి బి. అప్పలస్వామి తీర్పు ఇచ్చారు. జ్యోతిర్మయికి జీవిత ఖైదు, నరేష్, రాజులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, 500 రూపాయల జరిమానా విధించారు. ఈ కోర్టు తీర్పు జిల్లాలో మరోసారి సంచలనంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *