ప్రస్తుత జనరేషన్ యువతకు ప్రాణాలు అంటే లెక్కలేకుండా పోతుంది. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రేమలో ఫెయిలయ్యామని, ప్రేమించిన వారు తిట్టారని, ప్రేమించిన అమ్మాయి తనతో మాట్లాడట్లేదని, పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని, తల్లిదండ్రులు తిట్టారని, ఫ్రెండ్స్ ఏడింపించారని ఇలా చిన్న చిన్న సమస్యలకు ప్రాణాలు తీసుకొని కంటి రెప్పలా చూసుకుంటున్న కన్నవారికి కడుపుకోతను మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ప్రాణాలు తీసుకునేంత ధైర్యం చేసిన వీరు.. ఆ ధైర్యాన్ని తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఎందుకు ఉపయోగించట్లేదో ఎవ్వరికీ అర్థంకాని ఒక ప్రశ్నలా మిగిలిపోతుంది. తాజాగా ఇలానే ప్రేమించిన అమ్మాయి తనతో మాట్లాడట్లేదని, తన కాల్స్‌కు రిప్లే ఇవ్వట్లేదనే మనస్తాపంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటపల్లి తాండాకు చెందిన జయపాల్ నాయక్ (19) అనే యువకుడు ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ.. మన్నూరులో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అతనికి వజ్రకరూరుకు మండలానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు కొన్నాళ్ల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మధ్య సదురు యువతి అతనితో మాట్లాడడం తగ్గించింది. జయపాల్ ఫోన్ చేసినా ఆమె స్పందిచకపోవడంతో మనస్తాపం చెందిన జయపాల్ నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రూమ్‌లో ఫ్యాన్‌కు ఊరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన జయపాల్ నాయక్‌ను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కిందకు దించి పరిశీలించారు. అతనకు అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..