Andhra: భార్యపై అనుమానం.. కట్ చేస్తే, ఉదయాన్నే కాపుకాచిన భర్త.. చివరకు..

Andhra: భార్యపై అనుమానం.. కట్ చేస్తే, ఉదయాన్నే కాపుకాచిన భర్త.. చివరకు..


Andhra: భార్యపై అనుమానం.. కట్ చేస్తే, ఉదయాన్నే కాపుకాచిన భర్త.. చివరకు..
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.. తిరుపతి రూరల్ మంగళం బొమ్మల క్వార్టర్స్‌లో జరిగిన ఈ రెండు ఘటనలు సంచలనంగా మారాయి. వివరాల ప్రకారం.. బొమ్మల క్వార్టర్స్ కు చెందిన ఉషకు గంగాధర నెల్లూరు మండలం ఠాణాకు చెందిన లోకేశ్వర్ తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరూ సమీప బంధువులు.. కాగా ఉషా – లోకేశ్వర్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదట్లో కాపురం సజావుగానే కొనసాగింది.. ఈ క్రమంలోనే.. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి.

కరకంబాడిలోని అమర రాజా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉష, బిఎస్ఎన్ఎల్‌లో కాంట్రాక్ట్ కింద టెక్నీషియన్ గా పని చేస్తున్న లోకేశ్వర్ మధ్య గత నెల 30 న పెద్ద గొడవ జరిగింది. ఉషపై అనుమానంతో లోకేశ్వర్ తరచూ గొడవపడుతుండడంతో భరించలేక పోయింది. బొమ్మల క్వార్టర్స్ లోనే కాపురం ఉంటున్న లోకేశ్వర్ ఉషా ఆ సమయంలో ఇద్దరు పిల్లలను తీసుకొని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయింది.

దీంతో ఇద్దరి మధ్య మరింత గ్యాప్ పెరగింది.. ఆ తర్వాత ఇది జీర్ణించుకోలేని లోకేశ్వర్.. భార్య ఉషను హతమార్చేందుకు ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో డ్యూటీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఉష.. కంపెనీ బస్సు కోసం వెళుతుండగా.. భర్త లోకేశ్వర్ అకస్మాత్తుగా ఆమెపై దాడి చేశాడు.. కత్తితో దాడి చేసి చంపాడు.

అప్పటివరకు మాటు వేసి భార్య రాక కోసం వెయిట్ చేసిన లోకేశ్వర్.. ఉషా ను వెంబడించి కత్తితో గొంతు కోసి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఉష చనిపోయిన తరువాత.. నేరుగా ఇంటికి వెళ్లి తాడుతో ఉరివేసుకొని లోకేశ్వర్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఇలా 34 ఏళ్ల ఉష హత్యకు గురికాగా.. 45 ఏళ్ల లోకేశ్వర్ ఆత్మహత్యకు చేసుకోని ప్రాణాలు తీసుకున్నాడు.. దీంతో పిల్లలు మాత్రం అనాథలుగా మిగిలిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తిరుచానూరు పోలీసులు డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *