సాధారణంగా మధ్యతరగతి కుటుంబానికి ఓ నెల కరెంట్ బిల్లు రూ. 1000 లేదా రూ. 1100 వస్తుంది. మహా అయితే రూ. 1500 అంతకముంచి రాదు. కానీ ఇక్కడ ఓ టీచర్ ఇంటికి కరెంట్ బిల్లు ఏకంగా రూ. 15 లక్షలు వచ్చింది. మరి అదేంటో..? ఏ ప్రాంతంలో వచ్చిందో..! ఇప్పుడు తెలుసుకుందామా.. వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలానికి చెందిన నన్నేషా హుస్సేన్ అనే రిటైర్డ్ టీచర్ ఇంటికి కరెంట్ బిల్లు ఏకంగా రూ. 15,14,993 వచ్చింది. దీంతో ఆ కరెంట్ బిల్లు చూసిన ఆయన లబోదిబోమంటున్నారు. ప్రతినెలా రూ. 1300 వచ్చే కరెంట్ బిల్లు.. ఈ నెల(జూలై)లో రూ. 15,14,993 రావడంపై ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌పై టీచర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం డిజిటల్ మీటర్లు వేసినప్పటి నుంచి సామాన్యులకు నెత్తిన కరెంట్ బిల్లులు భారం ఎక్కువ అయ్యిందని.. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ టీచర్ నన్నేషా హుస్సేన్ కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..