Andhra: గుప్త నిధుల కోసం మెటల్ డిటెక్టర్లు, గోల్డ్ స్కానర్స్ వాడారు – కానీ దొరికింది మాత్రం..

Andhra: గుప్త నిధుల కోసం మెటల్ డిటెక్టర్లు, గోల్డ్ స్కానర్స్ వాడారు – కానీ దొరికింది మాత్రం..


పురాతన దేవాలయాలు.. రాజులు పాలించిన కోటలు.. లాంటి చోట దండిగా గుప్త నిధులు ఉంటాయని.. స్వామీజీలు చెప్పారని… చాలామంది గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి కటకటాల పాలయ్యారు. మూఢనమ్మకాలతో… ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఆశతో.. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కానీ అనంతపురం జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కోసం తవ్వకాలు జరిపిన కేటుగాళ్లు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి పోలీసులనే ఆశ్చర్యపరిచారు. అనంతపురం జిల్లా గుంతకల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగసముద్రం శివారులో గుప్త నిధుల తవ్వకాలు జరుపుతున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులకు… ఆసక్తికర విషయాలు  తెలిశాయి. బహుశా గుప్త నిధులు తవ్వకాలలో ఫస్ట్ టైం అత్యాధునిక టెక్నాలజీ వాడటం ఇదే తొలిసారి అనుకుంట. గుప్త నిధుల కోసం… వాటిని గుర్తించేందుకు ఏకంగా మెటల్ డిటెక్టర్లు, గోల్డ్ స్కానర్‌లను తీసుకొచ్చి గుప్త నిధుల తవ్వకాలు జరిపిన ముఠా గుట్టురట్టు చేశారు గుంతకల్ రూరల్ పోలీసులు.

అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నాగసముద్రం గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నట్లు గుంతకల్ రూరల్ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పక్కా సమాచారంతో సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు గుప్త నిధులు తవ్వకాలు జరుపుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తే.. మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన మహేంద్ర అనే వ్యక్తి మరో నలుగురితో గుంతకల్‌‌కు వచ్చాడు… స్థానికంగా ఉంటున్నారు రాము అనే వ్యక్తిని గుంతకల్ చుట్టుపక్కల గుప్త నిధులు ఉన్నాయని… ఆ ప్రదేశాలు చూపించాలని మహేంద్ర కోరాడు. హైదరాబాద్‌కు చెందిన మహేంద్ర…. గుంతకల్‌కు చెందిన రాముతో కలిపి మొత్తం 9 మంది ఒక ముఠాగా ఏర్పడి… గుంతకల్ పరిసర ప్రాంతాల్లో గుప్త నిధుల కోసం వేట మొదలుపెట్టారు.

మూఢనమ్మకాలతో ఒక స్వామీజీ చెప్పిన మాటలు నమ్మి మహేంద్ర… రాము పురాతన దేవాలయాలు… పాడుబడిన కోటలు టార్గెట్ గా చేసుకుని గుప్త నిధుల కోసం తవ్వకాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా గుంతకల్ మండలం నాగసముద్రం శివారు కొండపై ఉన్న చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం పరిసరాలలో మహేంద్ర అండ్ కో ముఠా గుప్తనిధుల కోసం గత కొద్దిరోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు… కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కొండపై ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకొని… పలుగు, పారలతో తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు… దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కొండపై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న వారి దగ్గర పలుగు, గడ్డ పారలతోపాటు…. కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, అత్యాధునిక మెటల్ డిటెక్టర్లు… గోల్డ్ స్కానర్లను పోలీసులు గుర్తించారు. గుప్తనిధుల కోసం చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం పరిసరాల్లో దాదాపు పది అడుగుల లోతు గుంత తవ్వారు. పట్టుబడిన 9 మంది గుప్త నిధులు తవ్వకాల ముఠాను విచారించిన పోలీసులు షాక్ అయ్యారు… బాబాలు, స్వామీజీలు చెప్పిన మాటలు నమ్మి మహేంద్ర అండ్ కో గుప్త నిధులు ఎక్కడ ఉన్నాయి. గుప్త నిధులు తవ్వేందుకు నిధులు, లంకె బిందెలు ఎక్కడ ఉన్నాయో గుర్తించేందుకు ఏకంగా అత్యాధునిక మెటల్ డిటెక్టర్లు, గోల్డ్ స్కానర్లు, పలు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించి… ఈ ముఠా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు విచారణలో తేలింది.

అసలు ఇప్పటివరకు గుప్త నిధుల తవ్వకాల కోసం ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించిన ముఠా ఎక్కడ పోలీసులకు తారసపడలేదు. దీంతో ఈ ముఠా గుప్తనిధుల కోసం ఏకంగా లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవడంతో… పోలీసులే ఆశ్చర్యపోయారు. విచారణలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే… అనంతపురం జిల్లాలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతమైన గుత్తి కోటలో కూడా… ఈ ముఠా గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్లు విచారణలో తేలింది. మూఢవిశ్వాసాలు… బాబాలు, స్వామీజీలు చెప్పారని గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపే వారిని ఇప్పటివరకు చూసాం… కానీ ఈ ముఠా గుప్త నిధుల కోసం ఏకంగా లేటెస్ట్ టెక్నాలజీలు ఉపయోగించి కూడా గుప్త నిధులు తవ్వకాలు జరపడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఇంత అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి… మెటల్ డిటెక్టర్లు… గోల్డ్ స్కానర్లు… ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపితే… పిన్నీసులు, గుండు సూదులు, మట్టి కుండలు దొరికాయి… హైదరాబాదుకు చెందిన మహేంద్రతో పాటు మరో నలుగురు… గుంతకల్‌కు చెందిన రాముతో పాటు మరో ముగ్గురు… ఇలా మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు పంపించారు. పురాతన దేవాలయాలు… పాడుబడిన కోటలలో గుప్త నిధులు ఉంటాయని ఈ ముఠాకు చచ్చు సలహా ఇచ్చిన బాబా, స్వామీజీ ఎవరో కనుక్కునే పనిలో ఉన్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *